RR vs CSK : సీఎస్కేతో మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర కామెంట్స్.. భయపడి త్వరగా పడుకున్నా.. కేక్ కూడా కట్ చేయలేదు..
సోమవారం గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (RR vs CSK ) రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
IPL 2026 Vaibhav Sooryavanshi comments after Rajasthan Royals beat Chennai Super Kings
- విజయంతో ఐపీఎల్ 2026లో బోణీ కొట్టిన రాజస్థాన్
- చెన్నై సూపర్ కింగ్స్ పై ఘన విజయం
- ఆర్ఆర్ విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్
RR vs CSK : ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ విజయంతో టోర్నీని ఆరంభించింది. సోమవారం గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆర్ఆర్ విజయంలో ఆ జట్టు ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌కు కఠినంగా ఉన్న పిచ్ పై విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 52 పరుగులు చేశాడు.
వైభవ్ సూర్యవంశీకి తోడు యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 38 నాటౌట్) సమయోచితంగా ఆడడంతో 128 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 12.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది. అంతక ముందు ఆర్ఆర్ బౌలర్లు విజృంభించడంతో సీఎస్కే 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. సీఎస్కే బ్యాటర్లలో జామీ ఓవర్టన్ (43; 36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. మిగిలిన వారంతా ఘోరంగా విఫలం అయ్యారు.
ఇక ఈ మ్యాచ్‌లో గెలవడం పట్ల రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్ సమయంలో ప్రతి బంతి తరువాత తన సహచర ఓపెనర్ యశస్వి జైస్వాల్ తనతో మాట్లాడుతూనే ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ఎప్పుడు సింగిల్స్ తీయాలి, ఎప్పుడు ఎదురుదాడికి దిగాలి వంటి విషయాలను వివరిస్తూనే ఉన్నాడని అన్నారు.
తమ గేమ్ ప్లాన్.. పవర్ ప్లేలో హిట్టింగ్ చేసి మ్యాచ్‌ను సాధ్యమైనంత తొందరగా సీఎస్కే నుంచి లాగేసుకోవడమే అని చెప్పుకొచ్చాడు. ఇలాంటి చిన్న లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు పవర్ ప్లేలో రాణించడం చాలా కీలకం అని అన్నాడు. ఆరంభంలో బంతి కాస్త ఆగి వచ్చిందని, అయితే.. బాల్ కాస్త పాత బడిన తరువాత చాలా చక్కగా బ్యాట్ పైకి వచ్చిందన్నాడు. బౌలర్లు తనను టార్గెట్ చేస్తారని బయట అందరూ చెబుతున్నారని, అయితే.. తనకు కోచ్‌లు మద్దతు ఇచ్చారన్నాడు. సహజసిద్దమైన ఆటను ఆడతూ, పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయాలని వారు సూచించారన్నాడు.
Mohammed Siraj : బిగ్‌బాస్ బ్యూటీతో హైదరాబాదీ పేసర్ డేటింగ్..! వీడియో వైరల్
ఇక తన 15వ పుట్టిన రోజు (మార్చి 27) ఎలా జరుపుకున్నాడనే విషయాన్ని వెల్లడించాడు. ఆ రోజు తాను కేక్ కూడా కట్ చేయలేదన్నాడు. ముఖానికి కేక్ పూస్తారేమోనని భయపడి చాలా త్వరగా నిద్రపోయాను అని చెప్పి నవ్వులు పూయించాడు.
