Mohammed Siraj : బిగ్‌బాస్ బ్యూటీతో హైదరాబాదీ పేసర్ డేటింగ్..! వీడియో వైరల్
భారత స్టార్ ఆటగాడు. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) మరోసారి వార్తల్లో నిలిచాడు.
Mohammed Siraj Dating Mahira Sharma Viral Video
- మరోసారి మొదలైన సిరాజ్ డేటింగ్ రూమర్లు
- బిగ్‌బాస్ బ్యూటీ మహీరా శర్మతో
Mohammed Siraj : భారత స్టార్ ఆటగాడు. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అతడు ప్రముఖ నటి, బిగ్‌బాస్ ఫేమ్ మహీరా శర్మతో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు మరోసారి షికార్లు చేస్తున్నాయి. ముంబైలోని ఓ కేఫ్ బయట వారిద్దరూ కనిపించడమే ఇందుకు కారణం. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఈ వీడియోలో వారిద్దరు ఒకే ఫ్రేమ్‌లో కనిపించలేదు.
శనివారం (మార్చి 28)న ముంబైలోని ఓ ప్రముఖ హోటల్ బయట సిరాజ్ (Mohammed Siraj) తన అభిమానులతో ముచ్చటిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అదే రెస్టారెంట్ నుంచి మహీరా బయటకు వచ్చి తన కారు వైపుగా వెళ్లింది. దీన్ని చూసిన నెటిజన్లు వీరిద్దరు కలిసే వచ్చారని, తమ మధ్య సంబంధం బయటకు రాకుండా ఉండేందుకు విడివిడిగా బయటకు వచ్చారని అంటున్నారు. వీరిద్ధరి మధ్య ఖచ్చితంగా సమ్‌థింగ్, సమ్ థింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
🚨 Mohammed Siraj was spotted with Mahira Sharma at the same cafe.
Their dating rumours have already been circulating since 2024. pic.twitter.com/mWpYwmIAOT
— Tejash (@Tejashyyyyy) March 28, 2026
కాగా.. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారనే వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. వీరిద్దరు ఒకరి ఇన్‌స్టా గ్రామ్ను మరొకరు లైక్ చేయడం, ఫాలో అవ్వడం వంటి ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించాయి. అయితే అప్పుడే దీనిపై మహీరా శర్మ స్పందించింది. తాను ఎవరితో డేటింగ్లో లేనని చెప్పింది. మరోవైపు సిరాజ్ కూడా తామిద్దరం స్నేహితుమే అని, అంతకు మించి మరేం లేదని చెప్పాడు.
తాజా రూమర్ల పై వీరిద్దరు ప్రస్తుతానికి స్పందించలేదు. ప్రస్తుతం సిరాజ్ ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్‌కు అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
