RR vs MI : అదే మా కొంప ముంచింది.. బ్యాట‌ర్ల త‌ప్పేం లేదు.. హార్దిక్ పాండ్యా కీల‌క వ్యాఖ్య‌లు..

మంగ‌ళ‌వారం గౌహ‌తి వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 27 ప‌రుగుల తేడాతో ముంబై ఇండియ‌న్స్ (RR vs MI ) ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది.

IPL 2026 RR vs MI Hardik Pandya comments after Mumbai Indians lost match to Rajasthan Royals (pic credit @CricCrazyJohns)

  • ఆర్ఆర్ చేతిలో ప‌రాజ‌యం
  • బౌల‌ర్ల కార‌ణంగానే ఓడిపోయామ‌న్న‌ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా

RR vs MI : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో తొలి మ్యాచ్‌లో విజ‌యం సాధించిన ముంబై ఇండియ‌న్స్ ఆ త‌రువాత వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. మంగ‌ళ‌వారం గౌహ‌తి వేదిక‌గా రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 27 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. బౌల‌ర్ల వైఫ‌ల్యం కార‌ణంగా తాము ఈ మ్యాచ్‌లో ఓడిపోయామ‌ని ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు.

వ‌ర్షం వ‌ల్ల 11 ఓవ‌ర్ల‌కు మ్యాచ్‌ను కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్ణీత 11 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 150 ప‌రుగులు చేసింది. ఆర్ఆర్ బ్యాట‌ర్ల‌లో య‌శ‌స్వి జైస్వాల్ (77; 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), వైభ‌వ్ సూర్య‌వంశీ (39; 14 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స‌ర్లు) విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌లు ఆడాడు. కెప్టెన్ రియాన్ ప‌రాగ్ (20; 10 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స‌ర్లు) రాణించాడు. ముంబై బౌల‌ర్ల‌లో ఘజన్‌ఫ‌ర్ రెండు వికెట్లు తీశాడు. శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

అనంత‌రం 151 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 11 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 123 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ముంబై బ్యాట‌ర్ల‌లో న‌మ‌న్ ధీర్ (25), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (25), తిల‌క్ వ‌ర్మ (14) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ లు త‌లా రెండు వికెట్లు తీశారు. జోఫ్రా ఆర్చ‌ర్‌, తుషార్ దేశ్‌పాండే లు చెరో వికెట్ సాధించారు.

Heinrich Klaasen : కాస్లెన్ కాక‌కు క‌న్నీళ్లు తెప్పించిన హైద‌రాబాదీ బిర్యానీ.. ప‌డి ప‌డి న‌వ్వుకున్న ఇషాన్ కిష‌న్‌.. సిక్స‌ర్లు కొట్టినంత ఈజీ కాదు

మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మిపై ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బౌలర్ల వైఫ‌ల్య‌మే త‌మ కొంప ముంచింద‌న్నాడు. ప్ర‌ణాళిక‌ల‌కు త‌గ్గ‌ట్లుగా బౌలింగ్ చేయ‌లేక‌పోయార‌ని చెప్పుకొచ్చాడు. బౌల‌ర్లు మ‌రింత బాధ్య‌త తీసుకోవాల్సి ఉంద‌న్నాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ల పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. అదే స‌మ‌యంలో మ్యాచ్ ఓట‌మికి త‌మ బ్యాటింగ్ ఏ మాత్రం కార‌ణం కాద‌ని, ఈ ఓట‌మికి ఖ‌చ్చితంగా బౌలింగ్ విభాగ‌మే బాధ్య‌త‌ తీసుకోవాల‌న్నాడు.

అత‌డికి ఎంతో భ‌విష్య‌త్తు ఉంది

టీ20 క్రికెట్‌లో రెండు బంతుల్లో ఫ‌లితం మారిపోతుంద‌న్నాడు. 27 ప‌రుగుల తేడాతో ఓడిపోయామంటే.. ఓ ఐదు బంతులు బౌల‌ర్లు చ‌క్క‌గా వేసి ఉంటే.. ఐదు సిక్స‌ర్లు వ‌చ్చేవి కావ‌న్నాడు. అప్పుడు మ్యాచ్ ఫ‌లితం మ‌రోలా ఉండేద‌న్నాడు. ఆర్ఆర్ ఓపెన‌ర్లు మ్యాచ్ ను త‌మ నుంచి లాగేసుకున్నార‌ని తెలిపాడు.

ఇక వైభ‌వ్ సూర్య‌వంశీ గురించి మాట్లాడుతూ.. 16 లేదా 17 ఏళ్ల కుర్రాడు నిర్భ‌యంగా ఆడ‌డం చూసి షాక్ అయ్యాన‌ని అన్నాడు. మ్యాచ్‌కు ముందు స‌న్నాహ‌కాల్లో అత‌డి గురించి చాలా చ‌ర్చించుకున్నామ‌ని చెప్పాడు. అతను బ్యాటింగ్ చేసే విధానం, అతనిలో ఉన్న నిర్భయత్వం, అతను ఆడే షాట్లు చూడటం అద్భుతంగా ఉంది. భవిష్యత్తులో ఇంకాస్త మెరుగ్గా రాణించాల‌ని కోరుకుంటున్నాను. అని హార్దిక్ అన్నాడు.

Anaya Bangar : అబ్బాయి నుంచి అమ్మాయిగా.. క్యూట్ ఫోటోల‌ను షేర్ చేసిన అన‌య బంగ‌ర్..

ఇక ఈ మ్యాచ్‌లో చేసిన త‌ప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటామ‌న్నాడు. రేపు ఉద‌యం సూర్యుడు ఉద‌యించిన‌ట్లే తాము కూడా పుంజుకుంటామ‌ని చెప్పుకొచ్చాడు.