Ruturaj Gaikwad : గుజ‌రాత్ చేతిలో ఓట‌మి.. రుతురాజ్ గైక్వాడ్ కీల‌క వ్యాఖ్య‌లు.. ముకేశ్ చౌద‌రి ఆడించాల‌ని అనుకున్నాం కానీ..

త‌మ జ‌ట్టు ఓట‌మిపై సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) స్పందించాడు.

IPL 2026 Ruturaj Gaikwad comments after csk lost match to GT (pic credit@ipl)

  • గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో ఓట‌మి
  • నిరాశ‌ను క‌లిగించింద‌న్న సీఎస్ కే కెప్టెన్
  • ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా ముకేశ్ చౌద‌రిని ఆడించాల‌ని అనుకున్న‌ట్లు వెల్ల‌డించిన రుతురాజ్‌

Ruturaj Gaikwad : ఐపీఎల్ 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతోంది. ఆదివారం (ఏప్రిల్ 26) చెన్నైలోని చెపాక్ మైదానంలో గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. పిచ్‌ను అంచ‌నా వేయ‌డంలో తాము విఫ‌లం అయ్యాయ‌ని, అదే స‌మ‌యంలో ప‌వ‌ర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోవ‌డం త‌మ ఓట‌మిని శాసించింద‌ని సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.

కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ( 74 నాటౌట్; 60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) రాణించ‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 158 ప‌రుగులు చేసింది. ఓవ‌ర్ట‌న్ (22) ఫ‌ర్వాలేద‌నిపించ‌గా సంజూ శాంస‌న్ (11), ఉర్విల్ ప‌టేల్ (4), స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (0), డెవాల్డ్ బ్రెవిస్ (2)లు విఫ‌లం అయ్యారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో క‌గిసో ర‌బాడ మూడు వికెట్లు తీశాడు. అర్షద్ ఖాన్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మానవ్ సుతార్, సిరాజ్‌లు చెరో వికెట్ ప‌డ‌గొట్టాడు.

Sanju Samson : చ‌రిత్ర సృష్టించిన సంజూ శాంస‌న్‌.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ఏకైక భార‌తీయుడు..

అనంత‌రం సాయి సుద‌ర్శ‌న్ (87; 46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీతో రాణించ‌డంతో గుజ‌రాత్ టైటాన్స్ 159 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 16.4 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్‌మ‌న్ గిల్ (33), జోస్ బ‌ట్ల‌ర్ (39 నాటౌట్‌) రాణించారు. చెన్నై బౌల‌ర్ల‌లో అకీల్ హోసేన్, నూర్ అహ్మద్ లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

170 ప‌రుగులు చేసుకుంటేనా

మ్యాచ్ అనంత‌రం త‌మ జ‌ట్టు ఓట‌మిపై రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. 170 లేదా 180 ప‌రుగులు చేసి ఉంటే ప‌రిస్థితి మ‌రో ర‌కంగా ఉండేదన్నాడు. నిజం చెప్పాలంటే ఈ పిచ్‌ను అంచ‌నా వేయడం క‌ష్ట‌మైంద‌న్నాడు. మీడియం పేస‌ర్ల బౌలింగ్‌లో బంతి ఆగి వ‌చ్చింద‌న్నాడు. కొన్ని సార్లు అనూహ్య బౌన్స్ ఉంద‌న్నాడు. ప‌వ‌ర్ ప్లేలో ఎక్కువ వికెట్లు కోల్పోకుండా ఉండి ఉంటే 170 లేదా 180 ప‌రుగులు చేసే వాళ్లం అని, అప్పుడు మంచి పోటీ ఇచ్చేవాళ్ల‌మ‌ని చెప్పుకొచ్చాడు.

Nicholas Pooran vs Sunil Narine : 12 ఏళ్ల క్రితం ఇలాగే.. న‌రెన్ వ‌ర్సెస్ పూర‌న్‌.. ఫామ్‌లో లేని ఆట‌గాడిని సూప‌ర్ ఓవ‌ర్‌లో పంప‌డం పై ల‌క్నో కోచ్ షాకింగ్ కామెంట్స్‌..

తాను దూకుడుగా ఆడాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని, అయితే.. బంతి ఓ సారి బౌన్స్ అవుతూ, మ‌రోసారి లో అవుతూ వ‌స్తుండ‌డంతో ఇబ్బంది ప‌డిన‌ట్లుగా చెప్పుకొచ్చాడు. ప్ర‌తి బంతికి శైలిని మార్చుకోవ‌డం క‌ష్ట‌మైంద‌న్నాడు. చివ‌రి నాలుగైదు ఓవ‌ర్ల‌లో వేగం పెంచాల‌ని ప్ర‌య‌త్నించాన‌ని తెలిపాడు. తాము ముందుగా అనుకున్న దాని ప్ర‌కారం ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా ముకేష్ చౌద‌రిని ఆడించాల‌ని అనుకున్నామ‌ని, అయితే.. ప‌వ‌ర్ ప్లేలోనే వికెట్లు కోల్పోవ‌డంతో నాలుగో ఓవ‌ర్‌లోనే బ్యాట‌ర్‌ను తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నాడు. అయితే.. దుర‌దృష్ట‌వ‌శాత్తు ఈ ప్ర‌ణాళిక ఫ‌లించ‌లేద‌న్నాడు. ఇక వీలైనంత‌ త్వ‌ర‌గా ఓట‌మిని మ‌రిచి పోయి త‌దుప‌రి మ్యాచ్ పై దృష్టి సారిస్తామ‌న్నాడు.