Ishan Kishan : ల‌క్నో పై ఓట‌మి.. ఎంతో గ‌ర్వంగా ఉంది.. స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ ఇషాన్ కిష‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

టాప్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ల వైఫ‌ల్యం కార‌ణంగానే ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఓడిపోయామ‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ ఇషాన్ కిష‌న్ (Ishan Kishan)తెలిపాడు.

IPL 2026 SRH vs LSG Ishan Kishan comments after Sunrisers Hyderabad lost match to Lucknow Super Giants (pic credit@ipl)

  • ల‌క్నో చేతిలో ఓడిపోయిన స‌న్‌రైజ‌ర్స్‌
  • 5 వికెట్ల తేడాతో
  • ప‌రాజ‌యం పై స్పందించిన ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిష‌న్‌
  • టాప్ ఆర్డ‌ర్ వైఫ‌ల్యం వ‌ల్లే

Ishan Kishan : ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ప్ర‌యాణం ప‌డుతూ లేస్తూ అన్న చందంగా సాగుతోంది. ఓ మ్యాచ్‌లో గెలిస్తే మ‌రో మ్యాచ్‌లో ఓడిపోతుంది. ఆదివారం ఉప్ప‌ల్ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు 5 వికెట్ల తేడాతో పరాజ‌యం పాలైంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 156 ప‌రుగులు సాధించింది. ఎస్ఆర్‌హెచ్ బ్యాట‌ర్ల‌లో హెన్రిచ్ క్లాసెన్ (62; 41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (56; 33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలు చేశారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ గొప్ప‌గా బౌలింగ్ చేశాడు. 4 ఓవ‌ర్ల‌లో 9 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ప్రిన్స్ యాద‌వ్‌, అవేశ్ ఖాన్ లు కూడా చెరో రెండు వికెట్లు తీశారు. దిగ్వేష్ సింగ్ రాఠీ, మణిమారన్ సిద్ధార్థ్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

అనంత‌రం రిష‌బ్ పంత్ (68నాటౌట్‌; 50 బంతుల్లో 9 ఫోర్లు), ఐడెన్ మార్‌క్ర‌మ్ (45; 27 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించ‌డంతో 157 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 19.5 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో హ‌ర్ష్ దూబె రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈషాన్ మ‌లింగ, శివంగ్ కుమార్ లు చెరో వికెట్ సాధించాడు.

Rajat Patidar : కోహ్లీ, భువీ కానే కాదు.. నేను ఒత్తిడిలో ఉంటే ఆ ఒక్క‌డి వైపే చూస్తా.. అతడంటే నాకు అంత న‌మ్మ‌కం : ఆర్‌సీబీ కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ హాట్ కామెంట్స్‌..

మ్యాచ్ అనంత‌రం స‌న్‌రైజ‌ర్స్ ఓట‌మిపై కెప్టెన్ ఇషాన్ కిష‌న్ స్పందించాడు. టాప్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్ల వైఫ‌ల్యం కార‌ణంగానే తాము ఈ మ్యాచ్‌లో ఓడిపోయామ‌ని చెప్పుకొచ్చాడు. త‌క్కువ స్కోరే అయిన‌ప్ప‌టికి కూడా ఆఖ‌రి వ‌ర‌కు మ్యాచ్‌ను తీసుకురావ‌డం ప‌ట్ల బౌల‌ర్ల కృషిని ప్ర‌శంసించాడు. లో స్కోరింగ్ మ్యాచ్‌ల్లో ఒక‌టి, రెండు బౌండ‌రీలే మ్యాచ్ స్వ‌రూపాన్ని మారుస్తాయ‌ని తెలిపాడు.

గ‌ర్వంగా ఉంది..

‘ఇదొక మంచి మ్యాచ్‌. వాస్త‌వానికి మా స్కోరు బోర్డుపై త‌గిన‌న్ని ప‌రుగులు లేవు. అయిన‌ప్ప‌టికి కూడా బౌల‌ర్లు చాలా గొప్ప‌గా బౌలింగ్ చేశారు. వారు స‌మ‌ర్ధ‌వంతంగా త‌మ ప్ర‌ణాళిక‌ల‌ను అమలు చేస్తూ చ‌క్క‌ని లైన్ అండ్ లెంగ్త్ ను పాటించారు. ఇక ఫీల్డ‌ర్ల‌కు కూడా క్రిడిట్ ఇవ్వాల్సిందే. ఇలాంటి లోస్కోరింగ్ మ్యాచ్‌ల్లో ఒక‌టి లేదా రెండు బౌండ‌రీల‌తో మ్యాచ్ స్వ‌రూపం మారిపోతుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన‌ప్ప‌టికి కూడా మేము పోరాడిన తీరుతో సంతోషంగా, గ‌ర్వంగా ఉన్నాను.’ అని ఇషాన్ కిష‌న్ అన్నాడు.

బ్యాటింగ్ వైఫ‌ల్యం గురించి మాట్లాడుతూ.. ఆరంభంలో నాలుగు వికెట్లు కోల్పోవ‌డంతో ఇత‌ర బ్యాట‌ర్ల‌పై ఒత్తిడి పెరిగింద‌న్నాడు. అయిన‌ప్ప‌టికి కూడా మెరుగైన స్కోరును అందించిన క్లాసెన్‌, నితీశ్‌ను అభినందించాల్సిందేన‌ని అన్నాడు. క్లిష్ట ప‌రిస్థితుల్లో చాలా చ‌క్క‌గా బ్యాటింగ్ చేశారు. వారిద్ద‌రికి కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందేన‌ని చెప్పుకొచ్చాడు. తాము బ్యాటింగ్‌లో మెరుగుప‌డాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నాడు. ఆరంభంలోనే తాము నాలుగు వికెట్లు కోల్పోతే ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ప‌ని సులువు అవుతుంద‌న్నాడు.

Ruturaj Gaikwad : త‌ప్పు నాదే.. మా వాళ్లు ఇలా బ్యాటింగ్ చేస్తార‌ని అనుకోలేదు.. ముందే తెలిసి ఉంటే..

ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత్ చాలా బాగా ఆడాడ‌ని ఇషాన్ మెచ్చుకున్నాడు. అత‌డు చాలా తెలివిగా సింగిల్స్ తీస్తూ మ్యాచ్‌ను లాగేసుకున్నాడ‌ని అన్నాడు. ఏదీ ఏమైన‌ప్ప‌టికి కూడా ఈ స్కోరు కాపాడుకోవ‌డం చాలా క‌ష్టం. అయిన‌ప్ప‌టికి కూడా చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు తీసుకువెళ్లడం బాగుంది. ఇది అతి పెద్ద సానుకూల అంశం అని ఇషాన్ అన్నాడు.