Kavya Maran-Krunal Pandya : కృనాల్ పై కావ్య పాప అసహనం.. ‘అరే ఇదేం బౌలింగ్ రా అయ్యా.. అట్ట ఇసుర్తున్నవ్..!’

Kavya Maran-Krunal Pandya : SRH vs RCB మ్యాచ్ సందర్భంగా కృనాల్ పాండ్యా బౌలింగ్ యాక్షన్ చూసి కావ్య పాప ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్ అవుతోంది.

ipl 2026 srh vs rcb Kavya Maran reaction to Krunal Pandya bowling action

Kavya Maran-Krunal Pandya :ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యంత ఉత్కంఠభరితంగా.. నరాలు తెగేంత టెన్షన్ గా సాగిన మ్యాచ్ ఏదైనా ఉందా అంటే అది శుక్రవారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్. ఆసాంతం అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో SRH.. ఆర్సీబీ జట్టు పై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అయితే నిన్న మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆర్‌సీబీ తరపున బౌలింగ్‌కు వచ్చిన కృనాల్ పాండ్య వేసిన కొన్ని బంతులు ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాక.. వాటిపై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఇలా విచిత్రమైన యాక్షన్ తో బౌలింగ్ చేసి బ్యాటర్లను గందరగోళానికి గురి చేయడం కృనాల్ పాండ్యకు అలవాటే. సన్‌రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ వేళ కూడా కృనాల్ తనదైన విచిత్రమైన బౌలింగ్ తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఈ మ్యాచ్ లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన కృనాల్.. బౌన్సర్లు విసిరి.. క్రీజులో ఉన్న వారిని భయపెట్టాడు.

*టీ20ల్లో చ‌రిత్ర సృష్టించిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్.. ప్ర‌పంచంలోనే ఏకైక జ‌ట్టుగా..

ఈ క్రమంలో స్టాండ్స్ నుంచి మ్యాచ్ చూస్తున్న కావ్య పాప.. కృనాల్ పాండ్య బౌలింగ్ చూసి తీవ్ర అసహనానికి గురయ్యింది. కృనాల్ వింత బౌలింగ్ చూసిన కావ్య పాప.. తన పక్కన ఉన్న వారితో.. ఏంటి ఇలా బౌలింగ్ చేస్తున్నాడు.. ఇదేం బౌలింగ్.. ఇది నిబంధనలకు విరుద్ధం కదా అనే అర్థం వచ్చేలా హావభావాలు పలికిస్తూ.. చేతులు ఊపుతూ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. అయితే కావ్య పాప యాక్షన్ ని కెమెరాలు క్యాప్చర్ చేశాయి. ఆ తర్వాత ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజనులు కూడా ఇదేం బౌలింగ్ రా అయ్యా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిన్నటి మ్యాచ్ లో ఆర్సీబీ 200 పరుగులకే ఆల్ అవుట్ కావడంతో.. ఎస్ఆర్హెచ్ 55 పరుగులు తేడాతో విజయం సాధించింది.