SRH : టీ20ల్లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ప్రపంచంలోనే ఏకైక జట్టుగా..
ఉప్పల్ వేదికగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH ) విజయం సాధించింది.
SRH Creates history Become First Team Ever to Register Nine 200+ Totals in One T20 Tournament (pic credit@ipl)
- టీ20ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అరుదైన ఘనత
- ఓ సీజన్లో అత్యధిక సార్లు 200+ స్కోర్లు సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డు
- ఐపీఎల్ 2026 సీజన్లో 9 సార్లు 200 + స్కోర్లు సాధించిన ఎస్ఆర్హెచ్
SRH : ఉప్పల్ వేదికగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది.
ఈ క్రమంలో ఓ టీ20 టోర్నమెంట్లో ఓ సీజన్లో అత్యధిక సార్లు 200 ఫ్లస్ పరుగులు సాధించిన జట్లుగా చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ ఇప్పటి వరకు 9 సార్లు 200 ఫ్లస్ పరుగులు చేసింది.
ఓ టీ20 టోర్నమెంట్లో ఓ సీజన్లో అత్యధిక 200+ స్కోర్లు సాధించిన జట్లు ఇవే..
* సన్‌రైజర్స్ హైదరాబాద్ – 9 సార్లు (ఐపీఎల్ 2026లో)
* గుజరాత్ టైటాన్స్ – 8 సార్లు (ఐపీఎల్ 2025లో)
* పంజాబ్ కింగ్స్ – 8 సార్లు ( ఐపీఎల్ 2025లో)
* పంజాబ్ కింగ్స్ – 8 సార్లు (ఐపీఎల్ 2026లో)
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 8 సార్లు (ఐపీఎల్ 2026లో)
* బర్మింగ్‌హామ్ బేర్స్ – 7 సార్లు (వైటాలిటీ బ్లాస్ట్ 2022లో)
* పంజాబ్ – 7 సార్లు (సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో)
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 7 సార్లు (ఐపీఎల్ 2026లో)
* యార్క్‌షైర్ – 6 సార్లు ( వైటాలిటీ బ్లాస్ట్ 2022లో)
* ముంబై ఇండియన్స్ – 6 సార్లు (ఐపీఎల్ 2023లో)
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. ఈ క్రమంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ పై రెండేసి సార్లు, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ఒక్కొసారి 200కి పైగా పరుగులు సాధించింది.
Rajat Patidar : గెలిచేందుకు ఆడలేదు.. మా లక్ష్యం అదే.. రజత్ పాటిదార్ కామెంట్స్ వైరల్..
ఐపీఎల్ 2026లో ఎస్ఆర్హెచ్ 200+ స్కోర్లు ఇవే..
* 201/9 వర్సెస్ ఆర్సీబీ ( బెంగళూరు వేదికగా)
* 226/8 వర్సెస్ కేకేఆర్ (కోల్‌కతా వేదికగా)
* 219/6 వర్సెస్ పంజాబ్ కింగ్స్ (న్యూ చండీగఢ్ వేదికగా)
* 216/6 వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (హైదరాబాద్ వేదికగా)
* 242/2 వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (హైదరాబాద్ వేదికగా)
* 229/5 వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( జైపూర్ వేదికగా)
* 249/4 వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై వేదికగా)
* 235/4 వర్సెస్ పంజాబ్ కింగ్స్ (హైదరాబాద్ వేదికగా)
* 255/4 వర్సెస్ ఆర్సీబీ (హైదరాబాద్ వేదికగా)
