SRH : క్వాలిఫయర్-1 కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? పాయింట్లు సమానంగా ఉన్నప్పటికి సన్‌రైజర్స్ ఎందుకు క్వాలిఫై అవ్వలేదు?
గుజరాత్, ఆర్సీబీలతో సమానంగా పాయింట్లు సాధించినప్పటికి కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH ) క్వాలిఫయర్-1కి అర్హత సాధించలేదు.
why srh not qualify for qualifier 1 match after same points with gt and rcb (pic credit @ipl)
- ఆర్సీబీపై విజయం
- సన్‌రైజర్స్ ఖాతాలో 18 పాయింట్లు
- అయినా గానీ మూడో స్థానంలోనే
SRH : ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. శుక్రవారం ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పై 55 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఈ సీజన్లో సన్‌రైజర్స్ కు ఇది చివరి లీగ్ మ్యాచ్ కాగా.. తొమ్మిదో విజయం. దీంతో ఆ జట్టు ఖాతాలో 18 పాయింట్లు వచ్చి చేరాయి.
మరోవైపు లీగ్ దశలో ఆర్సీబీ, గుజరాత్‌లు కూడా చెరో 14 మ్యాచ్‌లు ఆడేశాయి. ఇరు జట్లు కూడా చెరో 9 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడంతో వాటి ఖాతాల్లో కూడా 18 పాయింట్లే ఉన్నాయి.
కాగా.. మూడు జట్ల (సన్‌రైజర్స్, గుజరాత్, ఆర్సీబీ) ఖాతాల్లో సమాన పాయింట్లే ఉన్నప్పటికి కూడా పాయింట్ల పట్టికలో ఆర్సీబీ తొలి స్థానంలో గుజరాత్ రెండో స్థానంలో, సన్‌రైజర్స్ మూడో స్థానాల్లో నిలిచాయి. ఇందుకు ప్రధాన కారణం ఆయా జట్ల నెట్‌రన్‌రేటు.
Joe Root : ఎట్టకేలకు మౌనం వీడిన జోరూట్.. సచిన్ రికార్డు పై.. నేను పుట్టక ముందే..
ఆర్సీబీ నెట్‌రన్‌రేటు +0.783గా ఉండగా గుజరాత్ నెట్‌రన్‌రేటు +0.695గా ఉంది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నెట్‌రన్‌రేటు +0.524గా ఉంది.
ఆర్సీబీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రజత్ సేనను 166 పరుగుల లోపే సన్‌రైజర్స్ కట్టడి చేసి ఉంటే.. అప్పుడు గుజరాత్ నెట్‌రన్‌రేటును దాటి రెండో స్థానంలో ఉండేది సన్‌రైజర్స్. కానీ అలా జరగలేదు.

మే 26 (మంగళవారం ) క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. ఇక ఓడిపోయిన జట్టు మే 27 (బుధవారం ) జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2లో తలపడనుంది.
మే 29న క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. అంటే.. క్వాలిఫయర్-1కు అర్హత సాధించి ఆర్సీబీ, గుజరాత్‌లకు ఫైనల్ చేరుకునేందుకు రెండు మ్యాచ్‌ల అవకాశం ఉంటుంది.
ఇదిలా ఉంటే.. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడే జట్టు విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఆదివారం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
