IPL 2026: తిరుగులేని హైదరాబాద్.. వరుసగా 5వ గెలుపు.. ముంబైపై సంచలన విజయం..

  • Updated on- April 29, 2026 / 11:39 PM IST

IPL 2026: ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. హైదరాబాద్ ఖాతాలో మరో గెలుపు చేరింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. 244 రన్స్ టార్గెట్ ను హైదరాబాద్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. 6 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది.

హైదరాబాద్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (76), క్లాసెన్ (65 నాటౌట్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అభిషేక్ శర్మ (45) రాణించాడు. చివరలో సలీల్ అరోరా మెరుపు బ్యాటింగ్ చేశాడు. మూడు సిక్సర్లు బాదాడు. 10 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. ఇక, ఈ సీజన్ లో హైదరాబాద్ కు ఇది వరుసగా 5వ విజయం కావడం విశేషం. కాగా, ముంబై బ్యాటర్ రికల్టన్ చేసిన అద్భుత సెంచరీ (55 బంతుల్లో 123 పరుగులు) వృథా అయ్యింది.