Sunrisers Hyderabad : ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్ ఇదే.. ఉప్పల్ మైదానంలో ఎన్ని మ్యాచ్‌లు అంటే..?
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు (Sunrisers Hyderabad) లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడనుంది.
- Thota Vamshi Kumar
- Published On : March 27, 2026 / 11:36 AM IST
IPL 2026 Sunrisers Hyderabad Full Schedule here
Sunrisers Hyderabad : ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్ విడుదలైంది. పలు రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా తొలుత 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌నే విడుదల చేసిన బీసీసీఐ గురువారం మిగిలిన 50 మ్యాచ్‌ల తేదీలను ప్రకటించింది. ఇక ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది.
ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పూర్తి షెడ్యూల్ ఇదే..
* మార్చి 28న – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (బెంగళూరు)
* ఏప్రిల్ 2న – కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (కోల్‌కతా)
* ఏప్రిల్ 5న – సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( ఉప్పల్, మధ్యాహ్నం 3:30 గంటలకు)
* ఏప్రిల్ 11న – పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ముల్లన్‌పూర్, మధ్యాహ్నం 3:30 గంటలకు)
* ఏప్రిల్ 13న – సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (ఉప్పల్)
* ఏప్రిల్ 18న – సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (ఉప్పల్)
* ఏప్రిల్ 21న – సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (ఉప్పల్)
Our TATA IPL 2️⃣0️⃣2️⃣6️⃣ fixtures are here 👇
Let’s Play With Fire 🔥 pic.twitter.com/RX941aPrFL
— SunRisers Hyderabad (@SunRisers) March 26, 2026
* ఏప్రిల్ 25న – రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (జైపూర్)
* ఏప్రిల్ 29న – ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ముంబై)
* మే 3న – సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (ఉప్పల్)
* మే 6న – సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (ఉప్పల్)
* మే 12న – గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (అహ్మదాబాద్)
* మే 18న – చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (చెన్నై)
* మే 22న – సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఉప్పల్)
