IPL 2026: బెంగళూరుపై హైదరాబాద్ ఘన విజయం.. అయినా తప్పని నిరాశ

తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ చేసింది.

  • Published on- May 23, 2026 / 12:26 AM IST

IPL 2026: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. బెంగళూరుపై ఘన విజయం సాధించింది. 55 పరుగుల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది ఎస్ఆర్ హెచ్. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. 256 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 200 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధించినా.. హైదరాబాద్ కు నిరాశే ఎదురైంది. పాయింట్ల టేబుల్ లో సెకండ్ ప్లేస్ చేరేందుకు ఆర్సీబీని 160 రన్స్ లోపు కట్టడి చేయాల్సి ఉండగా.. అది సాధ్యం కాలేదు. దీంతో ఎస్ఆర్ హెచ్ 3వ స్థానానికే పరిమితమై ఎలిమినేటర్ ఆడనుంది.