Virat Kohli : వామ్మో భార్యతో కలిసి కోహ్లీ డ్యాన్స్ చూశారా? దినేశ్ కార్తీక్‌తో అయితే నెక్ట్ లెవెల్ స్టెప్పులు.. వీడియో
ఆర్‌సీబీ రెండోసారి కప్పును గెలవడంతో విరాట్ కోహ్లీ (Virat Kohli) సంతోషంలో డ్యాన్స్ చేశాడు.
- Thota Vamshi Kumar
- Updated on- June 1, 2026 / 10:19 AM IST
IPL 2026 Title win rcb Virat Kohli and Anushka Sharma Burn The Dance Floor
- రెండోసారి విజేతగా నిలిచిన ఆర్‌సీబీ
- ఆనందంలో డ్యాన్స్ చేసిన విరాట్ కోహ్లీ
Virat Kohli : ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఆర్‌సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ (37 బంతుల్లో 50 నాటౌట్) అర్ధశతకం చేశాడు. ఆర్‌సీబీ బౌలర్లలో రసిఖ్ సలాం దార్ మూడు, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు తీశాడు. కృనాల్ పాండ్యా ఓ వికెట్ పడగొట్టాడు.
ఆ తరువాత 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్‌సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (75 నాటౌట్; 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 32 పరుగులు) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు, సిరాజ్, రబాడ, అర్షద్ ఖాన్ లు తలా వికెట్ పడగొట్టారు.
ఐపీఎల్‌లో రెండోసారి విజయం సాధించిన తరువాత ఆర్‌సీబీ ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఆర్‌సీబీ జట్టు సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకుంది. ఇందులో విరాట్ కోహ్లీ.. తన భార్య అనుష్క శర్మ, బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తీక్‌తో పాటు ఇతర జట్టులోని పలువురు ఆటగాళ్లతో కలిసి ఆనందంగా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
𝗞𝗶𝗻𝗴 𝗞𝗼𝗵𝗹𝗶’𝘀 𝗺𝗮𝘀𝘁𝗲𝗿𝗰𝗹𝗮𝘀𝘀 𝗼𝗻 𝘁𝗵𝗲 𝗱𝗮𝗻𝗰𝗲 𝗳𝗹𝗼𝗼𝗿 😉
Pure vibes. Wholesome. And so much more. Anushka Sharma, thank you for being our Day 1. ❤️ pic.twitter.com/7Qmxxv6QtG
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 1, 2026
