Vaibhav Sooryavanshi : బెంగళూరు పై వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, యూసఫ్ పఠాల రికార్డులు బ్రేక్..
ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ఆటకు అభిమానులు ఫిదా అవుతున్నారు
- Thota Vamshi Kumar
- Published On : April 11, 2026 / 10:49 AM IST
IPL 2026 Vaibhav Sooryavanshi Surpasses Jaiswal Rahul and Pathan With Fiery Innings against RCB (pic credit@ipl)
- బెంగళూరు పై వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
- 15 బంతుల్లో హాఫ్ సెంచరీ
- ఐపీఎల్‌లో 15 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధిక సార్లు హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు
Vaibhav Sooryavanshi : ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ ఆటకు అభిమానులు ఫిదా అవుతున్నారు. 15 ఏళ్ల ఈ బుడ్డోడు బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్‌కు మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు. శుక్రవారం గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ అతడు విధ్వంసం సృష్టించాడు. 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు.
కాగా.. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లో హాఫ్ సెంచరీ గమనార్హం. ఈ క్రమంలోనే అతడు ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 15 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధిక సార్లు హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.
ఐపీఎల్‌లో 15 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధిక సార్లు హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
* జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (ఢిల్లీ క్యాపిటల్స్) – 2 సార్లు
* వైభవ్ సూర్యవంశీ (రాజస్థాన్ రాయల్స్) – 2 సార్లు
* యశస్వి జైస్వాల్ (రాజస్థాన్ రాయల్స్) – 1
* కేఎల్ రాహుల్ (పంజాబ్ కింగ్స్) – 1
* పాట్ కమ్మిన్స్ (కోల్‌కతా నైట్ రైడర్స్) – 1
* రొమారియో షెపర్డ్ (ఆర్‌సీబీ) – 1
* యూసుఫ్ పఠాన్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) – 1
* సునీల్ నరైన్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) – 1
* నికోలస్ పూరన్ (లక్నో సూపర్ జెయింట్స్) – 1
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ (40 బంతుల్లో 63 పరుగులు), విరాట్ కోహ్లీ (16 బంతుల్లో 32 పరుగులు) లు రాణించారు. ఆర్ఆర్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మలు తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ, రవీంద్ర జడేజాలు చెరో వికెట్ సాధించారు.
ఆ తరువాత 202 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 18 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్ఆర్ ఆటగాళ్లలో వైభవ్ సూర్యవంశీ (26 బంతుల్లో 78 పరుగులు), ధ్రువ్ జురెల్ (43 బంతుల్లో 81 నాటౌట్) మెరుపు అర్థశతకాలు సాధించారు. బెంగళూరు బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
