IPL 2027 Player Trades : ఐపీఎల్ ట్రేడ్స్‌లో భారీ మార్పులు.. హార్దిక్‌ పాండ్యాకు జాక్‌పాట్.. పంత్‌కు తప్పని నిరాశ

IPL 2027 Player Trades : ఐపీఎల్‌ 2027 మినీ వేలానికి ముందే ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల బదిలీలు ఆసక్తికరంగా మారాయి. స్టార్ ఆటగాళ్లను దక్కించుకునేందుకు జట్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

IPL 2027 Player Trades

IPL 2027 Player Trades : ఐపీఎల్‌ 2027 మినీ వేలానికి ముందే ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల బదిలీలు ఆసక్తికరంగా మారాయి. స్టార్ ఆటగాళ్లను దక్కించుకునేందుకు జట్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ ట్రేడ్స్‌లో కొందరు ప్లేయర్ల ధర భారీగా పెరగ్గా.. మరికొందరి ఒప్పంద విలువ భారీగా తగ్గింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, టీ.నటరాజన్, లియామ్ లివింగ్‌స్టోన్‌ల బదిలీలు చర్చనీయాంశంగా మారాయి.

Also Read : India vs New Zealand : భారత్‌కు బిగ్ షాకిచ్చేందుకు సిద్ధమైన కివీస్.. జట్టులో కీలక మార్పులు.. కొత్త బౌలర్ ఎంట్రీ..

హార్డిక్ పాండ్యాకు లక్కీ తగిలింది..
ముంబై ఇండియన్స్ నుంచి పంజాబ్ కింగ్స్‌కు మారిన హార్దిక్ పాండ్యా రూ.18 కోట్ల ఒప్పందంతో కొత్త జట్టులో చేరనున్నాడు. గతంలో ముంబై వద్ద ఆయన ధర రూ.16.35 కోట్లు. దీంతో హార్దిక్‌కు రూ.1.65 కోట్ల పెరుగుదల లభించింది. మరోవైపు పంజాబ్ నుంచి ముంబై ఇండియన్స్‌కు వెళ్లిన అర్ష్‌దీప్ సింగ్ ధర రూ.18 కోట్ల వద్దే కొనసాగనుంది.

పంత్‌కు రూ.12 కోట్ల కోత..
లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి వచ్చిన రిషబ్ పంత్‌కు ఈసారి రూ.15 కోట్ల ఒప్పందం కుదిరింది. గత వేలంలో లక్నో ఆయనను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో పంత్ ధరలో ఏకంగా రూ.12 కోట్ల తగ్గుదల నమోదైంది. ఢిల్లీ నుంచి లక్నోకు వెళ్లిన కుల్దీప్ యాదవ్ ధర రూ.13.25 కోట్ల వద్ద కొనసాగనుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వచ్చిన టీ.నటరాజన్‌కు రూ.5 కోట్ల ఒప్పందం కుదిరింది. గతంలో ఆయన ధర రూ.10.75 కోట్లు. అంటే రూ.5.75 కోట్ల తగ్గుదల నమోదైంది. హైదరాబాద్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లిన లియామ్ లివింగ్‌స్టోన్ ధర కూడా రూ.13 కోట్ల నుంచి రూ.6 కోట్లకు పడిపోయింది. జాక్ ఎడ్వర్డ్స్ రూ.3 కోట్లకు సీఎస్కేలో చేరాడు. ఇక సీఎస్కే నుంచి హైదరాబాద్‌కు ఖలీల్ అహ్మద్ రూ.4.8 కోట్లు, నాథన్ ఎల్లిస్ రూ.2 కోట్ల ఒప్పందాలతో వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చిన జీషన్ అన్సారీ ధర రూ.40 లక్షలుగా ఉంది.

డిసెంబర్ 16న గోవాలో ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. నవంబర్ 16 తర్వాత జట్ల రిటెన్షన్ జాబితాలు వెలువడనున్నాయి. అప్పటివరకు ట్రేడింగ్ విండో కొనసాగనుండటంతో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.