అనేక చర్చల అనంతరం ఐపీఎల్ ఫైనల్‌ను హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. మే12న జరగనున్న ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు టిక్కెట్లను మంగళవారం ఆన్‌లైన్‌లో ఉంచారు. అంతే 2నిమిషాల్లోనే టిక్కెట్లు అన్నీ అమ్ముడుపోయాయని సైట్ నిర్వహకులు వెల్లడించారు.
ఈవెంట్స్ నౌ అనే ప్రైవేట్ కంపెనీ టిక్కెట్ల అమ్మకాల వ్యవహారం చూసుకుంటోంది. మంగళవారం.. మధ్యాహ్నం 2గంటల నుంచి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఉంచుతామని తెలిపింది. సమయం 2దాటి 2నిమిషాలు పూర్తవగానే టిక్కెట్లు అన్నీ అయిపోయాయంటూ సైట్‌లో పెట్టేశారు. ఫణిశంకర్ అనే క్రీడాభిమాని టిక్కెట్ కొనేందుకు పడ్డకష్టాలను మీడియాతో ఇలా ముచ్చటించాడు.
‘సరిగ్గా మధ్యాహ్నం 12:01నిమిషాలకు ఈవెంట్స్ నౌలో లాగిన్ అయి సీట్లు సెలక్ట్ చేసుకుందామని ప్రయత్నించాను. అప్పటికే సౌత్ పెవిలియన్ మొత్తం బుక్ అయిపోయాయి. వెస్ట్, ఈస్ట్ స్టాండ్‌లలో టిక్కెట్లు అయినా దొరుకుతాయని ప్రయత్నించినా నిరుత్సాహమే మిగిలింది. మా స్నేహితులది కూడా ఇదే సమస్య. 1,500, `2,000, `2,500లతో పాటు `5,000టిక్కెట్లు కూడా క్షణాల వ్యవధిలో అమ్ముడుపోయాయి’ అని వెల్లడించాడు.
గవర్నమెంట్ కౌన్సిల్ ఈ టిక్కెట్ల మానిఫెస్టోను తయారుచేసింది. ఇందులో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. టిక్కెట్ అమ్మకాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు కొంత వాటాతో ఇవ్వనుండగా, మిగిలిన మొత్తం లాభాలన్నీ బీసీసీఐకే చెందనున్నట్లు ప్రముఖ పత్రిక వెల్లడించింది.
స్టేడియంలో మొత్తం 39వేల సీట్లు ఉంగా, ఈస్ట్, వెస్ట్, టెర్రస్‌లతో పాటు వీఐపీ సీటింగ్ కూడా అందుబాటులో ఉంది.