IPL 2021: యాడ్ రేట్లు అమాంతం పెంచేసిన స్టార్.. 10సెకన్లకు రూ.18లక్షలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అఫీషియల్ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ యాడ్ రేట్లను అమాంతం పెంచేసింది. యాడ్‌ల డిమాండ్ దృష్ట్యా 25శాతం నుంచి 30శాతానికి పెంచడంతో 10 సెకన్ల యాడ్ రూ.18లక్షలు
- Subhan Ali Shaik
- Published On : September 27, 2021 / 04:29 PM IST
Ipl Ad Rate
IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ అఫీషియల్ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ యాడ్ రేట్లను అమాంతం పెంచేసింది. యాడ్‌లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా 25శాతం నుంచి 30శాతానికి పెంచడంతో పది సెకన్ల యాడ్ రూ.18లక్షలకు చేరింది. గతంలో రూ.13 లక్షల నుంచి రూ.14లక్షల మధ్యలో ఉండేది. కొద్ది రోజుల్లో ఉన్న పండుగల దృష్ట్యా యాడ్‌ల ధరలు పెంచేసింది. అందిన సమాచారం ప్రకారం.. మిగిలిన 31మ్యాచ్‌లకు సంబంధించిన స్లాట్లు ఇప్పటికే ఫుల్ అయిపోయాయి.
స్టార్ నెట్‌వర్క్ దీనిపై ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కాకపోతే ఇప్పటికే Dream 11, PhonePe, Byjuలు ప్రధాన స్పాన్సర్లుగా ఉండగా.. అసోసియేట్ స్పాన్సర్లుగా Bingo, Kamla Pasand, AMFI, Asian Paints, Cadbury Dairy Milk, Amazon Prime, Thums Up, Garnier Men, CRED వ్యవహరిస్తున్నారు.
ఏప్రిల్ లో ముగిసిన ఫస్టాఫ్ లో 17మంది స్పాన్సర్లతో నడిపించింది. అందులో Just Dial, Vodafone- Idea, Groww, Frooti, Havells Fans లాంటి స్పాన్సర్లు సీజన్ సెకండాఫ్‌ను కంటిన్యూ చేయడానికి వెనుకడుగేశారు. యాడ్ రేట్లను పెంచిన విషయమై ఒక సీనియర్ మీడియా ప్లానర్ ఇలా మాట్లాడారు.
‘పండుగ సమయం కావడంతో పరిగణించదగ్గ డిమాండ్ ఉంది. మార్కెట్లు ఓపెన్ అయ్యాయి. బ్రాండ్లు చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నాయి. మార్కెటింగ్ ప్లాన్లు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి’ అని చెప్పుకొచ్చాడు.
