IPL 2023: ఐపీఎల్ జట్లు ఎన్ని? వాటి యాజమానులు ఎవరో తెలుసా?
ఐపీఎల్ 2023లో మొత్తం పది జట్లు పాల్గోనున్నాయి. అయితే, ఈ జట్లలో కొన్ని జట్ల యాజమానులే క్రికెట్ అభిమానులకు తెలుసు. మిగిలిన జట్ల యాజమానులు, ఎవరు? జట్టు బ్రాండ్ వాల్యూ, జట్టు సీఈవో లేదా సీఓఓ ఎవరు అనే విషయాలు తెలుసుకుందాం.
- Harishth Thanniru
- Published On : March 31, 2023 / 12:53 AM IST
IPL 2023
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (ఐపీఎల్) 16వ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. 31న రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మొత్తం 10 జట్లు ఈ టోర్నీలో పాల్గోనున్నాయి. పన్నెండు నగరాల్లో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో 70 మ్యాచ్‌లు జరగనుండగా, ప్లే ఆఫ్ దశలో నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ మే28న జరుగుతుంది.
IPL 2023: గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన ఐదుగురు కీలక ఆటగాళ్లు వీరే..
ఐపీఎల్ 2023లో మొత్తం పది జట్లు పాల్గోనున్నాయి. అయితే, ఈ జట్లలో కొన్ని జట్ల యాజమానులే క్రికెట్ అభిమానులకు తెలుసు. మిగిలిన జట్ల యాజమానులు, ఎవరు? జట్టు బ్రాండ్ వాల్యూ, జట్టు సీఈవో లేదా సీఓఓ ఎవరు అనే విషయాలు తెలుసుకుందాం.
జట్టు పేరు- యజమాని ..
ముంబై ఇండియన్స్ (ఇండియావిన్ స్పోర్ట్స్), చెన్నై సూపర్ కింగ్స్ ( చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్), ఢిల్లీ క్యాపిటల్స్ (జీఎంఆర్ గ్రూప్ అండ్ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్), కోల్‌కతా నైట్ రైడర్స్ (రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్‌మెంట్ అండ్ మెహతా గ్రూప్), రాజస్థాన్ రాయల్స్ (మనోజ్ బడాలే, గెర్రీ కార్డినాలే, శిల్పాశెట్టి), గుజరాత్ టైటాన్స్ (సీవీసీ క్యాపిటల్స్), సన్‌రైజర్స్ హైదరాబాద్ ( సన్ టీవీ నెట్‌వర్క్), పంజాబ్ కింగ్స్ ( ప్రీతి జింటా, మోహిత్ బర్మన్, నెస్ వాడియా, కరణ్ పాల్), లక్నో సూపర్ జెయింట్స్ (ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ ఆఫ్ సంజీవ్ గొయొంకా)
IPL Teams
జట్టు పేరు – బ్రాండ్ వాల్యూ (మిలియన్ డాలర్లలో) – సీఈవో/ సీఓఓ వివరాలు ఇలా..
ipl 2023 team details
