IPL2022 GT Vs RCB : హాఫ్ సెంచరీలతో రాణించిన కోహ్లి, రాజత్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..
గుజరాత్ బౌలర్లు చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బెంగళూరు భారీ స్కోరు చేసే చాన్స్ కోల్పోయింది. బెంగళూర బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (58), రాజత్ పాటిదార్ (52) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.(IPL2022 GT Vs RCB)
- Naveen
- Updated on- April 30, 2022 / 05:43 PM IST
Ipl2022 Gt Vs Rcb
IPL2022 GT Vs RCB : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా శనివారం గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన బెంగళూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ కు 171 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.
కాగా, గుజరాత్ బౌలర్లు చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బెంగళూరు భారీ స్కోరు చేసే చాన్స్ కోల్పోయింది. బెంగళూర బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (58), రాజత్ పాటిదార్ (52) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (33) ధాటిగా ఆడాడు. అయితే గుజరాత్ బౌలర్లు పుంజుకోవడంతో బెంగళూరు స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లను కోల్పోయింది. డుప్లెసిస్ డకౌట్ కాగా.. షాహ్‌బాజ్ 2*, మహిపాల్ లామ్రోర్ 16 పరుగులు చేశారు.(IPL2022 GT Vs RCB)
Virat Kohli First Fifty : ఎట్టకేలకు.. విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ
అల్జారీ జోసెఫ్ వేసిన ఓవర్‌లో లామ్రోర్ కొట్టిన బంతి రోప్‌కు తాకడంతో డేవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టినా అంపైర్లు నాటౌట్‌గా తేల్చారు. అయితే చివరి బంతికి భారీ షాట్‌కు యత్నించిన లామ్రోర్.. బౌండరీ లైన్ వద్ద మిల్లర్‌కే చిక్కాడు. గుజరాత్ బౌలర్లలో ప్రదీప్ సంగ్వాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. షమీ, అల్జారీ జోసెఫ్, ఫెర్గూసన్ తలో వికెట్ తీశారు.
కాగా, కొన్ని నెలలుగా ఫామ్ కోల్పోయి పరుగులు చేసేందుకు తీవ్రంగా తంటాలు పడుతున్న విరాట్ కోహ్లి… ఎట్టకేలకు రాణించాడు. అభిమానుల నిరీక్షణకు తెరదించాడు. ఐపీఎల్ 2022 సీజన్ 15లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. బ్రబౌర్న్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లి ఫిఫ్టీ కొట్టాడు.(IPL2022 GT Vs RCB)
Virat Kohli: వివ్ రిచర్డ్స్‌ను ఇంప్రెస్ చేసిన విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లి 45 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 6 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఈ ఐపీఎల్ లో 41, 12, 5, 48, 1, 12, 0, 0, 9 పరుగులతో పేలవ ప్రదర్శన చేశాడు విరాట్ కోహ్లి. కాగా, శనివారం గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో ఓపెనర్ గా దిగిన విరాట్ కోహ్లి.. క్రీజ్ లోకి వచ్చినప్పటి నుంచి షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. విరాట్ ఫిఫ్టీ కొట్టగానే గ్యాలరీలో ఉన్న విరాట్ భార్య అనుష్క శర్మ చప్పట్లు కొడుతూ ప్రోత్సహించింది. కాగా, హాఫ్ సెంచరీ కొట్టిన వెంటనే విరాట్ ఔటయ్యాడు. 53 బంతుల్లో 58 పరుగులు చేశాడు.
ఇప్పటివరకు ఎనిమిది మ్యాచులు ఆడిన గుజరాత్.. ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడి 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇక, బెంగళూరు విషయానికొస్తే.. తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు సాధించింది. ఈ మ్యాచ్ లో గెలుపొంది ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని బెంగళూరు భావిస్తుండగా.. ఇందులోనూ విజయం సాధించి అగ్రస్థానం పదిలపరుచుకోవాలని గుజరాత్ చూస్తోంది. చూడాలి మరి ఏ జట్టు విజయం సాధిస్తుందో!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు:
డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రాజత్ పాటిదార్, మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, షాబాబ్ అహ్మద్, మహిపాల్ లోమ్రార్, హసరంగ, హర్షల్ పటేల్, సిరాజ్, హేజిల్‌వుడ్.
గుజరాత్ టైటాన్స్ జట్టు:
శుభమన్ గిల్, వృద్ధీమాన్ సాహా, హార్దిక్ పాండ్య (కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్‌ఖాన్, ప్రదీప్ సాంగ్వాన్, అల్జరీ జోసెఫ్, ఫెర్గూసన్, షమీ.
