IRE vs IND : ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ.. 19 ఏళ్ల తరువాత బెల్‌ఫాస్ట్‌కు టీమ్ఇండియా
ఈ ఏడాది జూన్‌లో భారత జట్టు ఐర్లాండ్‌లో (IRE vs IND) పర్యటించనుంది.
- Thota Vamshi Kumar
- Published On : March 21, 2026 / 12:18 PM IST
IRE vs IND Team India Tour of Ireland BCCI announced Scheduled
- జూన్‌లో ఐర్లాండ్ పర్యటనకు భారత్
- షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ
IRE vs IND : ఈ ఏడాది జూన్‌లో భారత జట్టు ఐర్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య ఐర్లాండ్‌తో భారత్ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను శనివారం బీసీసీఐ విడుదల చేసింది. బెల్ఫాస్ట్ వేదికగా ఈ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. 2007 తరువాత బెల్‌ఫాస్ట్ వేదికగా భారత్ మ్యాచ్‌లు ఆడనుండడం ఇదే తొలిసారి.
జూన్ 26న తొలి టీ20, జూన్ 28న రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ రెండు మ్యాచ్‌లు సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. టీ20 ప్రపంచకప్ 2026 ఛాంపియన్లుగా భారత జట్టు నిలిచిన తరువాత ఆడనున్న తొలి టీ20 సిరీస్ ఇదే కావడం గమనార్హం.
🚨 News 🚨
Schedule announced for #TeamIndia‘s tour of Ireland for the 2️⃣-match T20I series 👌
Details ▶️ https://t.co/txJpSlQ7oi#IREvIND pic.twitter.com/rKYRmzBUU8
— BCCI (@BCCI) March 21, 2026
ఐపీఎల్ ముగిసిన తరువాత భారత జట్టు స్వదేశంలో జూన్ 6 నుంచి 20 మధ్య అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేలు, ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఆ తరువాత ఐర్లాండ్‌కు వెళ్లనుంది. ఐర్లాండ్ పర్యటన తరువాత ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.
Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ మాస్ వార్నింగ్.. నా దృష్టంతా దానిపైనే.. కాస్కోండి..
భారత్, ఐర్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టీ20 మ్యాచ్ – జూన్ 26న (బెల్‌ఫాస్ట్)
* రెండో టీ20 మ్యాచ్ – జూన్ 28న (బెల్‌ఫాస్ట్)
