LSG : ఐపీఎల్ 2026లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రాత‌మారేనా?

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఐపీఎల్‌లోకి (LSG) 2022లో ఎంట్రీ ఇచ్చింది.

Is Lucknow Super Giants performs well in IPL 2026

LSG : ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 2022లో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గ‌త నాలుగు సీజ‌న్ల‌లో ఆడిన‌ప్ప‌టికి కూడా ఐపీఎల్ ట్రోఫీ ఆ జ‌ట్టుకు అంద‌ని ద్రాక్ష‌గా మారింది. తొలి రెండు సీజ‌న్ల‌లో ల‌క్నో జ‌ట్టు మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసింది. టాప్‌-4లో నిలిచింది. ఆ త‌రువాత వ‌రుస‌గా రెండు సీజ‌న్ల‌లో కూడా ఏడో స్థానంతో స‌రిపెట్టుకుంది.

స్టార్ ప్లేయ‌ర్ల అండ‌, బ్యాటింగ్‌లో డెప్త్‌, బౌలింగ్‌లో ప‌దును, సీనియ‌ర్లు, జూనియ‌ర్ల మేళ‌వింపు ఇలా అన్ని ఉన్నా ఎందుక‌నో ఐపీఎల్ ట్రోఫీని మాత్రం ల‌క్నో అందుకోలేక‌పోతుంది. గ‌త సీజ‌న్‌లో కేఎల్ రాహుల్ ను త‌ప్పించి మ‌రీ రిష‌బ్ పంత్‌కు సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ప్ప‌టికి కూడా ఆ జ‌ట్టు రాత మార‌లేదు.

ఈ నేప‌థ్యంలో ఐపీఎల్ 2026లో కొన్ని కీల‌క మార్పుల‌తో ల‌క్నో జ‌ట్టు బ‌రిలోకి దిగుతోంది. స‌న్‌రైజ‌ర్స్ నుంచి ట్రేడింగ్‌లో ష‌మీని 10 కోట్ల‌కు తీసుకుంది. న‌మ‌న్ తివారి, అక్ష‌త్ ర‌ఘువంశీ, అర్జున్ టెండూల్క‌ర్ వంటి యువ ఆట‌గాళ్ల‌ను జ‌ట్టులో చేర్చుకుంది. ఇక వేలంలో జోష్ ఇంగ్లిష్, ముకుల్ చౌద‌రిల‌ను సొంతం చేసుకుంది. వీరంతా జ‌ట్టుకు ఎలా సాయ‌ప‌డ‌తారో చూడాల్సి ఉంది.

MS Dhoni : ఎంఎస్ ధోనికి గాయం ? ఐపీఎల్ 2026 నుంచి త‌ప్పుకుంటాడా? ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌..

హెడ్ కోచ్‌గా జ‌స్టిన్ లాంగ‌ర్ ఉండ‌గా.. కివీస్ దిగ్గ‌జ ఆట‌గాడు కేన్ విలియ‌మ్స‌న్‌ను వ్యూహాత్మ‌క స‌ల‌హాదారుగా నియ‌మించుకుంది. జ‌హీర్ ఖాన్ స్థానంలో భ‌రత్ అరుణ్‌ను బౌలింగ్ కోచ్‌గా నియ‌మించుకుంది. ఈ మార్పులు అయిన ల‌క్నో రాత‌ను మారుస్తాయో లేదో.

బ‌లాలు ఇవే..

రిష‌బ్ పంత్, ఐడెన్ మార్‌క్ర‌మ్‌, మిచెల్ మార్ష్, నికోల‌స్ పూర‌న్‌, జోస్ ఇంగ్లిష్‌ల‌తో కూడిన బ్యాటింగ్ లైన‌ప్ ల‌క్నోకు అతి పెద్ద బ‌లం. ముఖ్యంగా గ‌త ఐపీఎల్‌లో నికోల‌స్ పూర‌న్ ఆడిన విధానాన్ని ఫ్యాన్స్ ఎవ‌రూ కూడా అంత త్వ‌ర‌గా మ‌రిచిపోలేరు. ఈ సారి ల‌క్నో మేనేజ్‌మెంట్ అత‌డి నుంచి అలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌లే ఆశిస్తోంది. ఇక గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌గా మారిన పంత్ ఫామ్ అందుకుంటే ఆ జ‌ట్టుకు తిరుగులేదు.

ఇక బౌలింగ్‌లో టీమ్ఇండియా పేస‌ర్లు, మ‌హ్మ‌ద్ ష‌మీ, అవేశ్ ఖాన్‌, మ‌యాంక్ యాద‌వ్ లు ఉండ‌నే ఉన్నారు. వీరితో పాటు ప్ర‌పంచ స్థాయి స్పిన్ ఆల్‌రౌండ‌ర్ హ‌స‌రంగా ఉండనే ఉన్నాడు. గ‌త సీజ‌న్‌లో అంచ‌నాల‌కు మించి రాణించిన లెగ్ స్పిన్న‌ర్ దిగ్వేశ్ రాఠి ఆ జ‌ట్టు తురుపు ముక్క‌.

బ‌ల‌హీన‌త‌లు..

క్ష‌ణాల్లో మ్యాచ్ గ‌మ‌నాన్ని మార్చే స్టార్ హిట్ట‌ర్లు ఉన్న‌ప్ప‌టికి కూడా స‌మిష్టిగా రాణించ‌లేక‌పోవ‌డం ల‌క్నో ప్ర‌ధాన బ‌ల‌హీన‌త‌. లోయ‌ర్ మిడిల్ ఆర్డ‌ర్‌లో నిల‌క‌డ‌గా ఆడే బ్యాట‌ర్లు లేరు. ష‌మీ, మ‌యాంక్ రూపంలో నాణ్య‌మైన పేస‌ర్లు ఉన్న‌ప్ప‌టికి కూడా వారిని ఫిట్‌నెస్ స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి. వీరిద్ద‌రు అన్ని మ్యాచ్‌ల్లో ఆడ‌తారా? అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి.

IPL 2026 : కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు మ‌రో భారీ షాక్‌.. గాయంతో మ‌రో భార‌త పేస‌ర్ దూరం..!

ఐపీఎల్ 2026 కోసం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు ఇదే..

రిష‌బ్ పంత్, అబ్దుల్ స‌మ‌ద్, మిచెల్ మార్ష్, ఐడెన్ మార్‌క్ర‌మ్‌, బ్రీజ్కే, నికోల‌స్ పూర‌న్‌, జోష్ ఇంగ్లిస్‌, హ‌స‌రంగ‌, షాబాజ్ అహ్మ‌ద్‌, అర్షిన్ కుల‌క‌ర్ణి, ఆయుష్ బ‌దోని, మ‌హ్మ‌ద్ ష‌మీ, మ‌యాంక్ యాద‌వ్‌, అవేశ్ ఖాన్, అర్జున్ టెండూల్క‌ర్, మ‌ణిమార‌న్ సిద్దార్థ్‌, దిగ్వేశ్ రాఠి, ఆకాశ్ సింగ్‌, ప్రిన్స్ యాద‌వ్‌, న‌మ‌న్ తివారి, మోసిన్ కాన్, ముకుల్ చౌద‌రి, అక్ష‌త్ ర‌ఘువంశీ.