Ishan Kishan : ఆర్సీబీతో మ్యాచ్.. కెప్టెన్‌గా చరిత్ర సృష్టించనున్న ఇషాన్ కిషన్..
రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయపడడంతో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan ) సారథ్యంలో సన్‌రైజర్స్ బరిలోకి దిగనుంది.
Ishan Kishan Set To Create History On Captaincy Debut For SRH In IPL 2026
Ishan Kishan : ఐపీఎల్ 2026 సీజన్ నేటి (శనివారం మార్చి 28) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడనున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయపడడంతో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సారథ్యంలో సన్‌రైజర్స్ బరిలోకి దిగనుంది. ఐపీఎల్ చరిత్రలో ఇషాన్ కిషన్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి మ్యాచ్ కానుంది. ఈ నేపథ్యంలో అతడు ఓ అరుదైన రికార్డును అందుకోనున్నాడు.
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహించిన అతి పిన్న వయస్కుడైన భారత కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించనున్నాడు. ప్రస్తుతం ఇషాన్ వయసు 27 సంవత్సరాల 253 రోజులు. ఇక ఓవరాల్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అతి పిన్నవయసులో కెప్టెన్సీ వహించిన రికార్డు కివీస్ ఆటగాడు కేన్ విలియమ్సన్ పేరిట ఉంది. అతడు 27 ఏళ్ల 244 రోజుల వయసులో అంటే 2018లో ఎస్ఆర్హెచ్కు నాయకత్వం వహించాడు.
MS Dhoni : సీఎస్కేకు బిగ్ షాక్.. పిక్క కండరాల గాయంతో బాధపడుతున్న ధోని.. రెండు వారాలు ఆటకు దూరం
ఇప్పటి వరకు శిఖర్ ధావన్, మనీష్ పాండే, భువనేశ్వర్ కుమార్ లు మాత్రమే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నాయకత్వం వహించిన భారత ఆటగాళ్లు.
ఇషాన్ పై నమ్మకం ఉంది..
ఇషాన్ కిషన్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించాలన్న జట్టు మేనేజ్మెంట్ నిర్ణయం పై ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ డానియల్ వెటోరి సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అతడు ఆత్మవిశ్వాసం గల ఆటగాడని, నాయకుడిగా తనను తాను నిరూపించుకున్నాడని చెప్పుకొచ్చాడు.
SunRisers Hyderabad : సన్‌రైజర్స్ ఈ తప్పులు సరిదిద్దుకోకపోతే ఫస్టు మ్యాచ్ ఫసక్..!
ఇషాన్ కిషన్ అండర్-19 జట్టుకు, దేశవాళీలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో నాయకుడిగా తన జట్టుకు టైటిల్ అందించాడు.
