Ishan Kishan : ఇషాన్ కిషన్ బ్యాట్‌ను గమనించారా? వద్దన్నాడా? ఒప్పందం ముగిసిందా?
ఇషాన్ కిషన్ బ్యాట్‌కు (Ishan Kishan ) సంబంధించి ఓ వార్త చర్చనీయాంశంగా మారింది.
- Thota Vamshi Kumar
- Updated on- April 14, 2026 / 01:02 PM IST
Ishan Kishan was spotted without a bat sponsor logo in IPL 2026 matches (pic credit@ipl)
- గత రెండు మ్యాచ్‌ల్లో బ్యాట్ స్పాన్సర్ లోగో లేకుండానే ఆడిన ఇషాన్ కిషన్
- ఎస్‌జీతో ఒప్పందం ముగిసిందా?
- కొత్త బ్రాండ్‌తో చర్చలు జరుపుతున్నాడా?
Ishan Kishan : ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయాల బాట పట్టింది. సోమవారం ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ చెలరేగి ఆడాడు. 44 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 91 పరుగులు చేశాడు.
కాగా.. ఇషాన్ కిషన్ బ్యాట్‌కు సంబంధించి ఓ వార్త చర్చనీయాంశంగా మారింది. అతడి బ్యాట్ పై ఏ కంపెనీ బ్రాండ్ లోగో లేకపోవడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సాధారణంగా ప్రతి ప్లేయర్ కూడా తమ బ్యాట్‌పై కనీసం ఓ స్పాన్సర్ లోగోతో కనిపిస్తుంటారు. ఇక ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌ల్లో ఇషాన్ కిషన్ బ్యాట్ పై లోగో కనిపించింది. అయితే.. గత రెండు మ్యాచ్‌ల నుంచి మాత్రం అతడి బ్యాట్ పై లోగో కనిపించడం లేదు.
ఇషాన్ కిషన్ చాలా కాలంగా SG తో అనుబంధం కలిగిఉన్నాడు. అతడి బ్యాట్‌పై SG లోగో కనిపిస్తూ ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లే కాదు దేశవాళీ మ్యాచ్‌ల్లోనే కాదు అతడు ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ అతడి బ్యాట్ పై ఎస్‌జీ లోగో కనిపిస్తూ ఉంటుంది. కాగా.. అతడి కెరీర్ ప్రారంభ దశలో 2018-19 వరకు CEAT బ్యాట్‌లను ఉపయోగించాడు. కానీ 2019 నుంచి అతడు ఎస్‌జీ లోగో ఉన్న బ్యాట్‌లనే ఉపయోగిస్తూ వస్తున్నాడు.
అయితే.. గత రెండు మూడు మ్యాచ్‌ల నుంచి అతడి బ్యాట్ పై ఎలాంటి లోగో లేకపోవడం గమనార్హం. ఇందుకు కారణం..ఎస్‌జీతో అతడి ఒప్పందం గడువు ముగిసి ఉండవచ్చునని అంటున్నారు. అదే కంపెనీతో లేదంటే కొత్త బ్రాండ్ కోసం చర్చలు జరుగుతున్న కారణంగానే అతడు ఖాళీ బ్యాట్‌తో (ఎలాంటి లోగో లేని ) ఆడుతున్నాడని పలువురు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఇషాన్ నుంచి గానీ, ఎస్‌జీ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
🚨 Ishan Kishan is playing without a bat sponsor.
No brand is willing to sponsor a bat for a player who won the World Cup just two months ago? This is so disheartening to watch as a fan.💔 pic.twitter.com/Bz9WEkKn5X
— Selfless⁴⁵ (@SelflessCricket) April 13, 2026
రాబోయే మ్యాచ్‌లలో ఇషాన్ కిషన్ ఏదైనా కొత్త బ్రాండ్‌తో ఒప్పందం కుదుర్చుకుని దాని లోగోతో ఆడతాడా? లేదంటే ఐపీఎల్ 2026 సీజన్ ముగిసే వరకు ఖాళీ బ్యాట్‌తోనే ఆడతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.
