ICC T20I Rankings : టీ20 ర్యాంకింగ్స్.. భారత ఆటగాళ్ల హవా.. యశస్వి జైస్వాల్ 7, శివమ్ దూబె 207 స్థానాలు ఎగబాకి..
యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శివమ్ దూబెలు టీ20 ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టారు.
- Thota Vamshi Kumar
- Updated on- January 17, 2024 / 05:19 PM IST
Yashasvi Jaiswal 7 and Shivam Dube 207 rises places in ICC T20 batting rankings
ICC T20I Rankings : అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో అద్భుతంగా ఆడుతున్న యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శివమ్ దూబెలు టీ20 ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టారు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఏడు స్థానాలు మెరుగుపరచుకోగా, అక్షర్ పటేల్ 12, శివమ్ దూబె ఏకంగా 207 స్థానాలు పైకి ఎగబాకాడు.
గాయం కారణంగా అఫ్గాన్ సిరీస్‌కు దూరమైనప్పటికీ టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. ఇంగ్లాండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రెండో టీ20 మ్యాచులో 34 బంతుల్లో 68 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ ఏడు స్థానాలు ఎగబాకి కెరీర్ అత్యుత్తమ ర్యాంకు ఆరో స్థానానికి చేరుకున్నాడు. అటు శివమ్ దూబె 265వ స్థానం నుంచి 58వ స్థానానికి చేరుకున్నాడు.
Mohammed Shami : గుజరాత్ టైటాన్స్‌ను వీడనున్న శుభ్‌మన్ గిల్..? షమీ సంచలన వ్యాఖ్యలు..
టాప్-10 టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్..
1 సూర్యకుమార్ యాదవ్ (భారత్) – 869 రేటింగ్ పాయింట్లు
2. ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్) – 802
3. మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్) – 775
4. బాబర్ ఆజం (పాకిస్తాన్) – 763
5. ఐడెన్ మార్క్రామ్ (దక్షిణాప్రికా) – 755
6. యశస్వి జైస్వాల్ (భారత్)- 739
7. రిలే రాస్ (దక్షిణాఫ్రికా) – 689
8. జోస్ బట్లర్ (ఇంగ్లాండ్) – 680
9. రుతురాజ్ గైక్వాడ్ (భారత్) – 661
10. రిజా హెండ్రిక్స్ (దక్షిణాఫ్రికా) – 660
Praggnanandhaa : ప్రజ్ఞానంద సంచలనం.. విశ్వనాథన్ ఆనంద్‌కు షాక్.. భారత టాప్ చెస్ ప్లేయర్‌గా..
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ మొదటి స్థానంలో నిలిచాడు. అతడి ఖాతాలో 726 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. భారత్ నుంచి అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్‌లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు.
టీ20ల్లో టాప్ 10 బౌలింగ్ ర్యాంకింగ్స్..
1. ఆదిల్ రషీద్ (ఇంగ్లాండ్) – 726
2. అకేల్ హోసిన్ (వెస్టిండీస్)- 683
3. వనిందు హసరంగా (శ్రీలంక)- 680
3. మహేశ్ తీక్షణ (శ్రీలంక)- 680
5. అక్షర్ పటేల్ (భారత్)- 667
6. రవి బిష్ణోయ్ (భారత్)- 666
7. రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్)- 658
8. తబ్రైజ్ షమ్సీ (దక్షిణాప్రికా)- 654
9. ఫజల్హక్ ఫరూకీ (అఫ్గానిస్తాన్)- 645
10. రీస్ టాప్లీ (ఇంగ్లాండ్) – 643
