Jasprit Bumrah : తండ్రైన జస్ప్రీత్ బుమ్రా.. చిన్నారి పేరేంటో తెలుసా..?
టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తండ్రైయ్యాడు. అతడి భార్య సంజనా గణేశన్ (Sanjana Ganeshan) సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
- Thota Vamshi Kumar
- Updated on- September 4, 2023 / 01:44 PM IST
Jasprit Bumrah becomes father
Jasprit Bumrah becomes father : టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తండ్రైయ్యాడు. అతడి భార్య సంజనా గణేశన్ (Sanjana Ganeshan) సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను స్వయంగా బుమ్రానే సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశాడు. బుమ్రాకు ఇదే మొదటి సంతానం. కాగా.. తన కుమారుడికి అంగద్ జస్ప్రీత్ బుమ్రా అని పేరు పెట్టినట్లు వెల్లడించాడు.
Virat Kohli : కోహ్లి కోసమే వచ్చా.. నా గుండె పగిలిపోయిందన్న పాక్ యువతి.. వీడియో వైరల్
‘మా చిన్న కుటుంబం ఇప్పుడు పెరిగింది. ఈ ఉదయం మా లిటిల్ ప్రిన్సెస్ అంగద్ జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచంలోకి స్వాగతించాము. ఇప్పుడు మా హృదయాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాము. మా జీవితాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దానితో పాటు వచ్చే ఫలితాల కోసం వేచిచూస్తున్నాము.’ అంటూ బుమ్రా ఎక్స్‌లో(ట్విటర్) రాసుకొచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా బుమ్రా-సంజన దంపతులకు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఆసియాకప్ కోసం శ్రీలంకలో ఉన్న బుమ్రా సడెన్‌గా ఆదివారం నాడు స్వదేశానికి బయలు దేరి వచ్చాడు. అయితే.. ఎందుకు వచ్చాడు అనే విషయం చాలా మందికి తెలియదు. మళ్లీ గాయపడ్డాడా..? ఎవరికి అయిన ఏమైన అయ్యిందా..? అని అభిమానులు కంగారు పడ్డారు. అయితే.. బుమ్రా తన భార్య డెలివరీ అయినట్లు చెప్పడంతో అందరిలో ఉన్న టెన్షన్ పోయింది. నేపాల్‌తో మ్యాచ్‌కు దూరం అయిన బుమ్రా మళ్లీ సూపర్ 4 మ్యాచ్‌లకు టీమ్ఇండియాతో కలవనున్నాడు.
