KL Rahul : IPL చరిత్రలో KL రాహుల్ నయా రికార్డ్.. తిలక్ వర్మను దాటి.. తొలి భారతీయుడిగా

KL Rahul : పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ తర్వాత రాహుల్ పలు రికాార్డులు బ్రేక్ చేసి నయా చరిత్ర సృష్టించాడు.

KL Rahul blasts the highest ever IPL and T20 score by an Indian

KL Rahul : అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పరుగుల వరద పారించాడు. కేవలం 67 బంతుల్లోనే 152 పరుగులు (నాటౌట్) చేసి ఐపీఎల్ చరిత్రలో తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 150, అంతకన్నా ఎక్కువ స్కోర్ చేసిన తొలి భారతీయుడిగా రాహుల్ నయా రికార్డు సృష్టించాడు. దీంతో పాటు ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో (6 సెంచరీలు) క్రిస్ గేల్ సరసన నిలిచాడు.

రాహుల్ రికార్డులు..

  • తొలి భారతీయుడు: ఐపీఎల్ చరిత్రలో 150 కన్నా ఎక్కువ పరుగులు చేసిన మొట్టమొదటి భారతీయ బ్యాటర్‌గా రాహుల్ రికార్డు నెలకొల్పాడు.
  • అభిషేక్ రికార్డు బ్రేక్: గత ఏడాది పంజాబ్ కింగ్స్‌పైనే అభిషేక్ శర్మ చేసిన 141 పరుగుల రికార్డును రాహుల్ ఈరోజు (2026, ఏప్రిల్ 25న) బ్రేక్ చేశాడు.
  • తన రికార్డు బ్రేక్: నేటి మ్యాచ్ తర్వాత రాహుల్ మరో అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు 132 పరుగులతో రాహుల్ పేరిట ఉన్న రికార్డును అభిషేక్ బ్రేక్ చేస్తే.. ఇప్పుడు రాహుల్ దాన్ని బ్రేక్ చేశాడు. తన స్థానాన్ని దక్కించుకున్నాడు.

టీ20ల్లో సరికొత్త రికార్డు:

మెన్స్ టీ20 క్రికెట్‌లో ఒక భారతీయ బ్యాటర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా ఇదే కావడం విశేషం. 2024లో మేఘాలయపై తిలక్ వర్మ చేసిన 151 పరుగుల రికార్డును కేఎల్ రాహుల్ తిరగరాశాడు. దీంతో పాటు నేటి మ్యాచ్ తర్వాత ఐపీఎల్ చరిత్రలో 150+ పరుగులు చేసిన ముగ్గురు దిగ్గజాల జాబితాలో (క్రిస్ గేల్, బ్రెండన్ మెకల్లమ్ తర్వాత) రాహుల్ చేరాడు.

ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు:

నేటి మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 152 (నాటౌట్) స్కోర్ చేసి, ఐపీఎల్ చరిత్రలోనే మూడవ అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ గా నిలిచాడు.

  • క్రిస్ గేల్ 2013లో పుణే వారియర్స్ పై 175 పరుగులతో నాటౌట్ గా నిలిచి తొలి స్థానంలో ఉండగా..
  • బ్రెండన్ మెకల్లమ్ 2008లో ఆర్‌సీబీపై 158 పరుగులతో నాటౌట్ గా రెండో స్థానంలో నిలిచాడు.
  • కేఎల్ రాహుల్ 2026లో పంజాబ్ కింగ్స్ పై 152 పరుగులతో నాటౌట్ గా నిలిచి మూడో స్థానంలో నిలవగా తర్వాత స్థానాల్లో..
  • ఆ తర్వాత అభిషేక్ శర్మ 141 పరుగులు, క్వింటన్ డి కాక్ (140 పరుగులతో నాటౌట్) ఉన్నారు.

నేడు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ లో.. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 264 పరుగుల భారీ స్కోరును సాధించింది.