Virat Kohli : టీ20ల్లో కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు.. టీమ్ఇండియా క్రికెటర్లలో ఒకే ఒక్కడు
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఖాతాలో మరో రెండు రికార్డులు వచ్చి చేరాయి.
Virat Kohli – IPL 2024 : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఖాతాలో మరో రెండు రికార్డులు వచ్చి చేరాయి. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో వీటిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 27 బంతులను ఎదుర్కొన్న అతడు 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్లో 12500 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అదే సమయంలో ఐపీఎల్లో విజయాలు సాధించిన మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ రికార్డులకు ఎక్కాడు.
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్‌గేల్ ఉన్నాడు. ఈ యూనివర్సల్ బాస్ 463 మ్యాచుల్లో 14,562 పరుగులు చేశాడు. ఈ జాబితాలో కోహ్లి నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక భారత ఆటగాళ్లలో విరాట్ తరువాత స్థానంలో కెప్టెన్ రోహిత్ శర్మ 11482 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 14562 పరుగులు
షోయబ్ మాలిక్ (పాకిస్తాన్) – 13360 పరుగులు
కీరన్ పోలార్డ్ (వెస్టిండీస్) – 12900 పరుగులు
విరాట్ కోహ్లి (భారత్) – 12536 పరుగులు
అలెక్స్ హేల్స్ (ఇంగ్లాండ్) – 12319 పరుగులు
ఐపీఎల్ విజయాల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
విరాట్ కోహ్లి – 4039 పరుగులు
శిఖర్ ధావన్ – 3945 పరుగులు
రోహిత్ శర్మ – 3918 పరుగులు
డేవిడ్ వార్నర్ – 3710 పరుగులు
సురేశ్ రైనా – 3559 పరుగులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గుజరాత్ టైటాన్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్యాన్ని ఆర్సీబీ 13.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఓపెనర్లు ఫాప్ డుప్లెసిస్ (64; 23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లి (42; 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.
Cheteshwar Pujara : నేనింకా రిటైర్ కాలేదు.. సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్ పంపిన పుజారా!