Virat Kohli : విరాట్ కోహ్లి పై మండిప‌డ్డ గ‌వాస్క‌ర్‌..! విమ‌ర్శ‌లు ప‌ట్టించుకోకుంటే స‌మాధానాలు ఎందుకు?

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి పై దిగ్గ‌జ ఆట‌గాడు సునీల్ గ‌వాస్క‌ర్ మ‌రోసారి తీవ్రంగా మండిప‌డ్డాడు.

Virat Kohli : విరాట్ కోహ్లి పై మండిప‌డ్డ గ‌వాస్క‌ర్‌..! విమ‌ర్శ‌లు ప‌ట్టించుకోకుంటే స‌మాధానాలు ఎందుకు?

Angry Sunil Gavaskar hits back at Virat Kohli

Virat Kohli strike rate : ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి పై దిగ్గ‌జ ఆట‌గాడు సునీల్ గ‌వాస్క‌ర్ మ‌రోసారి తీవ్రంగా మండిప‌డ్డాడు. కామెంటేట‌ర్స్ పై కోహ్లి చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ గ‌వాస్క‌ర్ విరుచుకుప‌డ్డాడు. త‌మ‌కంటూ ప్ర‌త్యేక ఎజెండా అంటూ ఉండ‌ద‌ని, 118 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేస్తే దాన్ని స్లో ఇన్నింగ్స్ అనే అంటార‌న్నాడు.

కాగా.. ఇటీవ‌ల స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో మ్యాచ్‌లో కోహ్లి 43 బంతులు ఎదుర్కొని 51 ప‌రుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి స్ట్రైక్‌రేటు త‌క్క‌వగా ఉండ‌డంతో గ‌వాస్క‌ర్ తో పాటు మరికొంద‌రు మాజీ ఆట‌గాళ్లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సింగిల్స్ తీస్తూ కోహ్లి నిదానంగా ఆడార‌ని, ఏ ఫ్రాంచైజీ అయినా కూడా ఇలాంటి ఇన్నింగ్స్‌లు కోరుకోద‌ని ఆ స‌మ‌యంలో గ‌వాస్క‌ర్ అన్నాడు. మ‌రికొంద‌రు సైతం .. ప‌వ‌ర్ ప్లే త‌రువాత కోహ్లి హిట్టింగ్ చేయ‌లేక‌పోతున్నాడ‌ని విమ‌ర్శించారు.

Cheteshwar Pujara : నేనింకా రిటైర్ కాలేదు.. సెల‌క్ట‌ర్ల‌కు స్ట్రాంగ్ మెసేజ్ పంపిన పుజారా!

విమ‌ర్శ‌ల‌పై కోహ్లి కౌంట‌ర్..

త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై కోహ్లి కాస్త గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చాడు. చాలా మంది త‌న స్ట్రైక్‌రేటు గురించి మాట్లాడుతున్నార‌ని, స్పిన్ ఆడ‌డంలో ఇబ్బందులు ప‌డుతున్నాన‌ని అంటున్నారు. అయితే.. నా వ‌ర‌కు జ‌ట్టుకు విజ‌యాల‌ను అందించ‌డ‌మే. గ‌త 15 ఏళ్లుగా అదే చేస్తున్నా. అందుకే ఇన్నాళ్లు జ‌ట్టులో ఉన్నా. మైదానంలో ఉన్న ప‌రిస్థితులు అర్థం చేసుకోకుండా కామెంట్రీ బాక్స్‌లో కూర్చొని మాట్లాడ‌డం స‌రికాదు అని కోహ్లి అన్నాడు.

ఈ వ్యాఖ్య‌ల‌పైనే గ‌వాస్క‌ర్ మండిప‌డ్డాడు. కోహ్లి స్ట్రైక్ రేటు పైనే కామెంటేట‌ర్లు మాట్లాడారు. అయితే.. అంద‌రూ మాట్లాడారు అని చెప్ప‌లేన‌న్నాడు. తాను ఎక్కువ‌గా మ్యాచులు చూడ‌న‌ని, అందుక‌నే ఇత‌ర కామెంటేట‌ర్లు ఏమ‌న్నారో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పాడు. అయితే.. ఓపెన‌ర్‌గా వ‌చ్చి 14-15 ఓవ‌ర్ వ‌ర‌కు క్రీజులో ఉండి 118 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేస్తే ఎవ్వ‌రూ పొగ‌డ‌ర‌ని అన్నాడు. ప్రసంశ‌లు కావాలంటే భిన్నంగా ఆడాల్సి ఉంటుంద‌ని గ‌వాస్క‌ర్ తెలిపాడు.

Dinesh Karthik : కాఫీ కూడా తాగ‌నివ్వ‌లేదురా అయ్యా.. ఆర్‌సీబీ వికెట్ల ప‌త‌నం పై దినేశ్ కార్తీక్‌
ఈ కుర్రాళ్లంతా బ‌య‌ట నుంచి వ‌చ్చే విమ‌ర్శ‌లు ప‌ట్టించుకోమ‌ని చెబుతూ ఉంటారు. అలా అయితే విమ‌ర్శ‌ల‌కు ఎందుకు బ‌దులు ఇస్తున్నార‌ని గ‌వాస్క‌ర్ ప్ర‌శ్నించాడు. అవును మేము చాలా త‌క్కువ మ్యాచులే ఆడాం. అయిన‌ప్ప‌టికి మాకు అజెండాలు లేవు. మేం ఏం చూస్తామో వాటి గురించే మాట్లాడుతాం. ఆట గురించే విశ్లేషిస్తామ‌ని గ‌వాస్క‌ర్ చెప్పాడు.