ఆ లైన్ దాటడం పిచ్చ హ్యాపీగా ఉంది: కోహ్లీ

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫుల్ హ్యాపీలో మునిగిపోయాడు. 20 రోజులుగా ఎదురుచూస్తున్న కల.. ఏడో ప్రయత్నంలో ఫలించడంతో కోహ్లీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఏప్రిల్ 13 మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను 8వికెట్ల తేడాతో ఓడించి లీగ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. 

వరుస ఓటములతో సతమతమవుతోన్న విరాట్ కోహ్లీ.. గెలిచి పరాజయాల హద్దు దాటడం చాలా ఆనందంగా ఉందని అంటున్నాడు. ‘ఆ లైన్ దాటడం చాలా హ్యాపీగా ఉంది. మేం దురదృష్టవంతులం అని చెప్పలేను కానీ, 6మ్యాచ్‌లలో రెండింటిలో గెలుపు దగ్గరి వరకూ వెళ్లాం. ఈ మ్యాచ్‌లో 190పరగులకు కట్టడి చేయాలని ముందుగా అనుకున్నాం’

‘కానీ, 173 పరుగులకే కట్టడి చేయడంలో ప్లేయర్లు బాగా కష్టపడ్డారు. ఇన్నాళ్లుగా ఎదురుచూసిన కల నెరవేరినట్లుగా అనిపిస్తోంది. చిన్న విజయమే అయినా చాలా సంతోషంగా ఉంది. కాన్ఫిడెన్స్ ఏ మాత్రం వదులుకోకుండా పోరాడటంతో విజయం దక్కింది. తర్వాతి మ్యాచ్‌లలోనూ ఇదే జోరును కొనసాగించాలని అనుకుంటున్నాం’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.