Shubman Gill Clean Bowled : యూఏఈతో మ్యాచ్‌కు ముందు.. స్థానిక బౌలర్ చేతిలో గిల్ క్లీన్ బౌల్డ్..
మంగళవారం భారత జట్టు ఐచ్చిక నెట్ సెషన్‌ను నిర్వహించింది. ఈ సెషన్‌లో గిల్ ఓ స్థానిక బౌలర్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు(Shubman Gill Clean Bowled).

Shubman Gill Clean Bowled By Local Bowler Ahead Of match against UAE
Shubman Gill Clean Bowled : ఆసియాకప్ 2025లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను నేడు (సెప్టెంబర్ 10 బుధవారం) ఆతిథ్య యూఏఈతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చు గానీ.. టీ20ల్లో ఏ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు.
కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు మంగళవారం భారత జట్టు ఐచ్చిక నెట్ సెషన్‌ను నిర్వహించింది. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లు సాధన చేశారు. ఐచ్చిక సెషన్ కావడంతో సీనియర్ ఆటగాళ్లు జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, హర్షిత్ రాణాలు విశ్రాంతి తీసుకున్నారు.
గిల్ క్లీన్ బౌల్డ్..
ఈ సెషన్‌లో టీమ్ఇండియా టీ20 వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎక్కువగా పేసర్లును ఎదుర్కొన్నాడు. కొన్ని చూడ చక్కని షాట్లు ఆడాడు. మంచి టచ్‌లో కనిపించాడు. అయితే..ఓ స్థానిక బౌలర్ బౌలింగ్‌లో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అతడి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ (Shubman Gill Clean Bowled) అయ్యాడని పీటీఐ తెలిపింది.
వైస్‌కెప్టెన్ కావడంతో యూఏఈతో మ్యాచ్‌లో భారత తుది జట్టులో గిల్ చోటు దక్కించుకోవడం ఖాయం. అయితే.. అతడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు అన్నదే ప్రస్తుతం పెద్ద ప్రశ్న. అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడా? లేదంటే నంబర్ 3 స్థానంలో ఆడతాడా అన్న ఆసక్తి అందరిలో ఉంది.
Asia cup 2025 : నేడే భారత్ తొలి మ్యాచ్.. జోరు మీదున్న సూర్య బృందం.. తుది జట్టు ఇదే.. ఇక రచ్చరచ్చే..
అభిషేక్ శర్మతో కలిసి శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా వస్తే.. రెగ్యులర్ ఓపెనర్ అయిన సంజూ శాంసన్ కిందకు దిగాల్సిందే. టాప్ ఆర్డర్‌లో ఆడించేట్లయితేనే శాంసన్‌కు తుది జట్టులో ఆడే ఛాన్స్ ఉంది. ఒకవేళ మిడిల్ ఆర్డర్‌లో అయితే జితేశ్ శర్మ మెరుగైన ప్రత్నామ్నాయంగా కావొచ్చు. దీంతో శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.