Hong Kong Sixes 2026 : భారత జట్టు కెప్టెన్సీలో కీలక మార్పు.. కృనాల్ పాండ్యాకు జట్టు పగ్గాలు..

Hong Kong Sixes 2026 : హాంకాంగ్ సిక్సెస్‌ - 2026 టోర్నీకి భారత జట్టును ఎంపిక చేశారు. అయితే, జట్టు కెప్టెన్సీలో మార్పుచోటు చేసుకుంది.

Hong Kong Sixes 2026

Hong Kong Sixes 2026 : హాంకాంగ్ సిక్సెస్‌ – 2026 టోర్నీకి భారత జట్టును ఎంపిక చేశారు. అయితే, జట్టు కెప్టెన్సీలో మార్పుచోటు చేసుకుంది. తొలుత కెప్టెన్‌గా ఎంపికైన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు న్యూజిలాండ్ పర్యటనకోసం భారత జాతీయ జట్టు నుంచి పిలుపు రావడంతో.. ఆయన స్థానంలో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

Also Read : Bhuvneshwar Kumar : బిగ్ బ్రేకింగ్‌.. వెస్టిండీస్‌తో ఐదో టీ20 మ్యాచ్.. భువ‌నేశ్వ‌ర్‌ కుమార్‌ను జ‌ట్టులోకి తీసుకున్న బీసీసీఐ

భువనేశ్వర్ కుమార్‌కు న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం భారత జట్టులో చోటు లభించింది. ఈ సిరీస్‌ అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. దీంతో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు జరగనున్న హాంకాంగ్ సిక్సెస్‌ టోర్నీకి ఆయన అందుబాటులో ఉండటం లేదు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత జాతీయ జట్టులోకి భువనేశ్వర్ తిరిగి రావడం విశేషం.

భారత జట్టు ఇదే ..
కృనాల్ పాండ్యా సారథ్యంలో బరిలోకి దిగనున్న భారత జట్టులో ఐపీఎల్‌లో సత్తాచాటిన పలువురు ఆటగాళ్లకు చోటు లభించింది. కృనాల్‌ పాండ్యా (కెప్టెన్‌), నితీశ్‌ రాణా, శశాంక్‌ సింగ్‌, టి.నటరాజన్‌, రాహుల్‌ త్రిపాఠి, రాహుల్‌ తెవాటియా, కుల్వంత్‌ ఖేజ్రోలియా ఉన్నారు.

ఏడుగురు సభ్యులతో కూడిన భారత జట్టు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు జరగనున్న హాంకాంగ్‌ సిక్సెస్‌-2026లో పాల్గొననుంది. ఈ టోర్నీలో ఒక్కోజట్టు నుంచి ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే మైదానంలో ఆడతారు. తక్కువ సమయంలో ఎక్కువ పరుగులు సాధించడం, దూకుడైన బ్యాటింగ్‌తో ప్రేక్షకులను అలరించడం ఈ టోర్నీ ప్రత్యేకత.