Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో లక్ష్యసేన్ దూకుడు.. క్వార్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ ఓటమి
పారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ అదరగొడుతున్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- August 1, 2024 / 08:53 PM IST
Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ అదరగొడుతున్నాడు. తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ పురుషుల బ్మాడ్మింటన్ సింగిల్స్‌లో క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో భారత్‌కే చెందిన హెచ్ ఎస్ ప్రణయ్ పై 21-12, 21-6 తేడాతో విజయం సాధించాడు.
ఈ మ్యాచ్‌లో ప్రణయ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కాగా.. ప్రణయ్ ఈ మ్యాచ్‌లో అలసిపోయినట్లుగా కనిపించాడు. ఆగస్టు 2న క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్ చైనాకు చెందిన చౌ తియెన్ చెన్‌తో తలపడనున్నాడు.
సాత్విక్-చిరాగ్ జోడీ ఓటమి..
ఎన్నో అంచనాలతో పారిస్ ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి-చిరాగ్ శెట్టిలు నిరాశపరిచారు. వారి ప్రయాణం క్వార్టర్ ఫైనల్స్‌లోనే ముగిసింది. 21-13, 14-21, 16-21 తేడాతో ఆరోన్-సో వూయి (మలేషియా) జంట చేతిలో ఓడిపోయారు.
తొలి గేమ్‌లో గెలిచి ఆధిపత్యం ప్రదర్శించిన సాత్విక్-చిరాగ్ జోడీ ఆ తరువాత అనూహ్యంగా వెనుకబడింది. వరుసగా రెండు, మూడు గేమ్‌లలో ఓడిపోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది.
