Lalit Modi – Vaibhav Sooryavanshi : ఈ ప్రపంచంలో నువ్వు ఏడైనా సదువుకో బిడ్డా.. నీకు నేనుండా.. వైభవ్ సూర్యవంశీకి ఐపీఎల్ ఫౌండర్ బంపర్ ఆఫర్
Lalit Modi: ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం ముల్లన్‌పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అదరగొట్టాడు
- Thota Vamshi Kumar
- Updated on- May 30, 2026 / 12:44 PM IST
Lalit Modi offered educational scholarship and free education to Vaibhav Sooryavanshi
- క్వాలిఫయర్-2లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
- 4 పరుగుల తేడాతో చేజారిన సెంచరీ
- అతడి బ్యాటింగ్‌కు ఫిదా అయిన ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోడీ
- 15 ఏళ్ల బుడ్డోడికి బంపర్ ఆఫర్
Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం ముల్లన్‌పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. 15 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. 47 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లు 96 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయినప్పటికి కూడా వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ 15 ఏళ్ల బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ కొనుగోలుగా అభివర్ణించారు. అంతేకాదండోయ్ బుడ్డోడికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఈ ప్రపంచంలో వైభవ్ ఎక్కడైనా చదువుకోవచ్చునని, అందుకు అయ్యే పూర్తి ఖర్చును తాను భరిస్తానని అన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో భావోద్వేగమైన ట్వీట్ చేశాడు.
*Shubman Gill : శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ఏకైక కెప్టెన్..
‘ఈ రోజు వైభవ్ సూర్యవంశీ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో ఆగిపోయి ఉండవచ్చు. కానీ నా దృష్టిలో అతను అంతకంటే గొప్పదాన్ని సాధించాడు. నిర్భయమైన యువ ప్రతిభ అంటే ఏమిటో అతను యావత్ దేశానికి చూపించాడు. క్రీడలు కేవలం వినోదం కోసమే కాకుండా అవకాశాలను సృష్టించడం కోసం కూడా ఉండాలని ఎల్లప్పుడూ నమ్మే వ్యక్తిగా.. ప్రపంచంలో ఎక్కడైనా ఏ విశ్వవిద్యాలయం లేదా కళాశాలలోనైనా వైభవ్ చదువుకోవడానికి అవసరమైన పూర్తి విద్యా స్కాలర్‌షిప్‌ను, దాని పూర్తి ఆర్థిక సహాయంతో అందించాలనుకుంటున్నాను. ఇది అతను సాధించిన పరుగుల కోసం కాదు. అతను లక్షలాది మంది యువ భారతీయులకు అందించిన ధైర్యం, నమ్మకం, స్ఫూర్తి కోసం. ప్రతిభను ఎప్పుడూ విద్య, గొప్పతనం మధ్య ఎంచుకునేలా బలవంతం చేయకూడదు
ఈ ఆఫర్ ఎప్పటికీ తెరిచే ఉంటుంది. అతను తన జీవితకాలంలో ఎప్పుడైనా ఈ ఆఫర్‌ను అంగీకరించవచ్చు. ipl అద్భుతమైన ఫలితాలను సృష్టిస్తుందని నేను ఆశించిన దానికి అతను నిజమైన నిదర్శనం. నేను చూసిన అద్వితీయమైన క్రీడా తార. ఐపీఎల్ యుగంలో ఎదిగాడు. అతడు లక్షలాది మందికి స్ఫూర్తిస్తున్నాడని ఆశిస్తున్నాను.’ అని లలిత్ మోడీ ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే.. వైభవ్ సూర్యవంశీకి ఐపీఎల్ 2026 ఒక కలల సీజన్‌గా నిలిచింది. అతను 16 మ్యాచ్‌లలో 48.50 సగటు 237.31 స్ట్రైక్‌రేటుతో 776 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఐదు హాఫె సెంచరీలు ఉన్నాయి.
