Sanjiv Goenka : నష్ట నివారణ చర్యలా? కెప్టెన్‌కు నా పూర్తి మద్దతు.. సోషల్ మీడియాలో సంజీవ్ గొయెంకా పోస్ట్
కేఎల్ రాహుల్ ఘటన తరువాత లక్నో యజమాని సంజీవ్ గొయెంకా (Sanjiv Goenka)పైనే అందరి దృష్టి ఉంటోంది.
- Thota Vamshi Kumar
- Updated on- April 2, 2026 / 11:57 AM IST
LSG owner Sanjiv Goenka post viral after Lucknow Super Giants lost match to Delhi Capitals
- ఢిల్లీపై ఓడిన లక్నో సూపర్ జెయింట్స్
- ఓటమి తర్వాత పంత్ తో మాటామాటా పెరిగినట్టు వీడియో వైరల్
- సడన్ గా కెప్టెన్ ను సపోర్ట్ చేస్తూ సంజీవ్ గోయెంకా పోస్ట్
Sanjiv Goenka : ఐపీఎల్ 2024లో ఓ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోరంగా ఓడిపోయింది. ఆ మ్యాచ్ ముగిసిన తరువాత అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై లక్నో యజమాని సంజీవ్ గొయెంకా మైదానంలోనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై అప్పట్లోనే గొయెంకాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తరువాత కేఎల్ రాహుల్ లక్నోను వీడడం, 27 కోట్ల భారీ మొతానికి లక్నో జట్టు రిషబ్ పంత్ ను కొనుగోలు చేసి కెప్టెన్సీ అప్పగించడం వంటివి జరిగాయి.
రాహుల్ ఘటన తరువాత లక్నో యజమాని సంజీవ్ గొయెంకా పైనే అందరి దృష్టి ఉంటోంది. ముఖ్యంగా లక్నో జట్టు ఓడిపోయినప్పుడు అతడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు అన్న విషయాలను నెటిజన్లు నిశితంగా గమనిస్తూ ఉన్నారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
మ్యాచ్ ముగిసిన వెంటనే జట్టు కెప్టెన్ రిషబ్ పంత్, హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్‌తో మైదానంలోని బౌండరీ లైన్ వద్ద లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకా ఏదో సీరియస్‌గా చర్చిస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని చూసిన నెటిజన్లు ఈయన మారడు అంటూ సంజీవ్ గొయెంకా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారు జామున తమ కెప్టెన్ పై విశ్వాసం వ్యక్తం చేస్తూ సంజీవ్ గొయెంకా సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను పంచుకున్నారు.
‘ఇది సుదీర్ఘమైన సీజన్. అర్థవంతమైన దానిని నిర్మించడంలో ఇలాంటి క్షణాలు ఒక భాగం. మా కెప్టెన్, జట్టు బలంగా పుంజుకుంటారని నాకు పూర్తి నమ్మకం ఉంది. అభిమానులారా.. ఈరోజు ఎకానాలో మీరు అందించిన మద్దతుకు ధన్యవాదాలు, మేము మరింత బలంగా తిరిగి వస్తాము. ఈ సీజన్‌లో లక్నో కథ ఇంకా ముగియలేదు.’ అని సంజీవ్ గొయెంకా ట్వీట్ చేశాడు.
LSG vs DC : అవే మా కొంపముంచాయి.. లేదంటేనా.. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కామెంట్స్..
