Lucknow Super Giants : దృశ్యం మూవీ చూపిస్తున్నారా? అక్కడ సీరియస్, ఇక్కడ నవ్వులు.. పంత్, గొయెంకా లక్నో వీడియో పై నెటిజన్ల ఫైర్.. పీఆర్ స్టంట్..
చూసేందంత నిజం కాదని, కెమెరాలు కట్ చేయనప్పుడు, మ్యాచ్ తరువాత సహజంగా జరిగిన సంభాషణ ఇదే అంటూ తమ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants ).
- Thota Vamshi Kumar
- Published on- April 3, 2026 / 10:57 AM IST
LSG released a clarification video following widespread speculation
- ఢిల్లీపై లక్నో ఓటమి
- మ్యాచ్ తరువాత పంత్‌తో సీరియస్‌గా చర్చించిన గోయెంకా వీడియో వైరల్
- చూసేదంత నిజం కాదంటూ మరో వీడియోను షేర్ చేసిన లక్నో
- రీ షూట్ చేశారంటూ మండిపడుతున్న నెటిజన్లు
Lucknow Super Giants : ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు 6 వికెట్లు తేడాతో ఓటమిని చవిచూసింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రిషబ్ పంత్, హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్‌లతో లక్నో జట్టు ఓనర్ సంజీవ్ గొయెంకా బౌండరీ లైన్ వద్ద సిరీయస్‌గా చర్చిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. పంత్, గొయెంకా మధ్య వాడీవేడీ సంభాషణ జరిగిందని అంటున్నారు. దీంతో నెట్టింట గోయెంకా పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
గెలుపు జోష్‌లో ఉన్న సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్..
అయితే.. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) మాత్రం అలాంటిది ఏమీ లేదని అంది. చూసేందంత నిజం కాదని, కెమెరాలు కట్ చేయనప్పుడు, మ్యాచ్ తరువాత సహజంగా జరిగిన సంభాషణ ఇదే అంటూ తమ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో పంత్, గోయెంకా సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
అయితే.. వైరల్ అయిన వీడియోలో మాత్రం వీరిద్దరు సీరియస్‌గా కనిపించడం గమనార్హం. ఇక ఇదే విషయాన్ని పోలుస్తూ నెటిజన్లు మరోసారి లక్నో జట్టుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. లక్నో పోస్ట్ చేసిన వీడియోలో అభిమానులు ఎవరూ కనిపించడం లేదు. దీంతో ఇది అసలైన వీడియోనేనా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. రెండు వీడియోలలో ఉన్న తేడాలను ఎత్తి చూపుతున్నారు. జరిగిన డ్యామేజీని కంట్రోల్ చేసుకునేందుకు దృశ్యం సినిమా స్ట్రైల్‌లో మరోసారి వీడియోను చేసి ఉండొచ్చునని, ఇదొక పీఆర్ స్టంట్ అని కామెంట్లు చేస్తున్నారు.
Cameron Green Run out : 25 కోట్లు నీళ్ల పాలు.. గ్రీన్ రనౌట్‌లో తప్పుఎవరిది?
