MS Dhoni : ఐ ల‌వ్ యూ ధోనీ.. అభిమాని పిలుపు.. మిస్ట‌ర్ కూల్ రియాక్షన్ మిస్ కాకూడదు.. వీడియో

టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికి మూడేళ్లు అయిన‌ప్ప‌టికీ అత‌డి ఫ్యాన్ పాలోయింగ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు.

Mahi Bhai I Love You Fan Shouts

MS Dhoni Reaction : టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికి మూడేళ్లు అయిన‌ప్ప‌టికీ అత‌డి ఫ్యాన్ పాలోయింగ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. భార‌త్‌కు రెండు ప్ర‌పంచ‌క‌ప్‌లు(2007 టీ20, 2011 వ‌న్డే) అందించిన మ‌హేంద్రుడు ఎక్క‌డికి వెళ్లినా స‌రే అత‌డి ఆటోగ్రాఫ్, సెల్ఫీల కోసం అభిమానులు ఎగ‌బ‌డుతుంటారు. తాజాగా ఓ ఎయిర్‌పోర్టులో ధోనీని చూసిన ఓ ఫ్యాన్‌ అత‌డిపై ఉన్న అభిమానాన్ని బ‌య‌ట‌పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

విమానాశ్ర‌యంలో ధోనిని చూసిన ఓ అభిమాని ‘మ‌హీ భాయ్ ఐ ల‌వ్ యు’ అంటూ గ‌ట్టిగా అరిచాడు. అప్పుడు ధోనీ సెక్యూరిటీ చెక‌ప్‌లో ఉన్నాడు. అత‌డి అరుపులు విన్న ధోనీ ఓ చిన్న చిరున‌వ్వు న‌వ్వాడు. ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Asian Games : భార‌త్ ఖాతాలో మ‌రో స్వ‌ర్ణం.. అద‌ర‌గొట్టిన రోహన్‌ బొపన్న- రుతుజ జోడీ

2020 ఆగ‌స్టు 15న మ‌హేంద్ర సింగ్ ధోనీ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 332 మ్యాచుల్లో టీమ్ఇండియాకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఇందులో 178 మ్యాచుల్లో భార‌త్ విజ‌యం సాధించ‌గా, 120 మ్యాచుల్లో ఓడిపోయింది. ఆరు మ్యాచులు టైగా ముగియ‌గా, 15 మ్యాచుల్లో ఫ‌లితం తేల‌లేదు. భార‌త్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్‌గా మ‌హేంద్రుడు నిలిచాడు. 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌, 2013 ఛాంపియ‌న్స్ ట్రోఫీలు ధోనీ సార‌థ్యంలో వ‌చ్చిన‌వే. ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో మాత్ర‌మే ధోని ఆడుతున్నాడు.

ట్రెండింగ్ వార్తలు