Sam Harper : ప్రాక్టీస్‌లో తీవ్రంగా గాయపడిన స్టార్ క్రికెటర్.. ఆస్పత్రిలో కొనసాగుతోన్న చికిత్స
బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ తరుపున ఆడుతున్న వికెట్ కీపర్ సామ్ హార్పర్ గాయపడ్డాడు.
- Thota Vamshi Kumar
- Updated on- January 5, 2024 / 07:07 PM IST
Sam Harper Hospitalised
Sam Harper Hospitalised : బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ తరుపున ఆడుతున్న వికెట్ కీపర్ సామ్ హార్పర్ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్లో అతడి తలకు బలమైన గాయమైంది. అప్రమత్తమైన చుట్టు పక్కల వారు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. స్పృహలోనే ఉన్నాడని, రాత్రికి అతడికి స్కానింగ్‌ను నిర్వహించనున్నట్లు మెల్బోర్న్ స్టార్స్ మేనేజ్మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది.
‘బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా 27 హార్పర్ గాయపడ్డాడు. అతడి తలకు బంతి తగిలింది. దీంతో అతడు నొప్పితో విలవిలలాడాడు. బాధతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అతడు స్పృహలోనే ఉన్నాడు. రాత్రికి అతడికి స్కానింగ్‌ను నిర్వహించనున్నారు. అతడి ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్లను ఎప్పటికప్పుడు తెలియజేస్తాం అని.’ మెల్బోర్న్ ప్రాంఛైజీ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
ICC Test Rankings : గెలుపు జోష్‌లో ఉన్న భారత్‌కు ఊహించని షాక్.. వదలని ఆస్ట్రేలియా గండం..!
కాగా.. అనుకోకుండా హార్పర్ గాయపడడంతో ప్రాక్టీస్ సెషన్‌ను మెల్బోర్న్ రద్దు చేసుకుంది. హార్పర్ ఇలా గ్రౌండ్లో గాయపడడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2020 జనవరిలో హోబర్ట్ హరికేన్స్ మ్యాచు సమయంలో నాథన్ ఎల్లిస్‌ను బలంగా ఢీకొట్టాడు. అప్పుడు గాయం కారణంగా ఆస్పత్రిలో అడ్మిన్ కావాల్సి వచ్చింది.
Virat Kohli : కోహ్లీ చేసిన పనికి దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ ఫిదా.. ఇది కదా కోహ్లీ అంటే..
ఇదిలా ఉంటే.. బిగ్‌బాష్ లీగ్ 2023-2024 సీజన్లో మెల్బోర్న్ స్టార్స్ ప్రయాణం పడుతూ లేస్తూ అన్న విధంగా సాగుతోంది. ఇప్పటి వరకు ఆ జట్టు ఏడు మ్యాచులు ఆడగా నాలుగు మ్యాచుల్లో విజయం సాధించింది. మరో మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
