×
Ad

Michael Vaughan : ద‌క్షిణాఫ్రికాకు అంత సీన్ లేదు.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీస్ చేరే నాలుగు జ‌ట్లు ఇవే..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో సెమీస్‌కు చేరే జ‌ట్లు ఏవో మైఖేల్ వాన్ (Michael Vaughan ) జోస్యం చెప్పాడు.

Michael Vaughan names T20 World Cup 2026 semi finalists

Michael Vaughan : క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 మ‌రో నాలుగు రోజుల్లో (ఫిబ్ర‌వ‌రి 7న‌) ప్రారంభం కానుంది. 20 జ‌ట్లు క‌ప్పు కోసం పోటీప‌డ‌నున్నాయి. ఈ జ‌ట్ల‌ను ఐదేసీ చొప్పున నాలుగు గ్రూపులుగా విభ‌జించారు.

గ్రూపు-ఏలో భారత్‌, పాకిస్తాన్, అమెరికా, నెద‌ర్లాండ్స్‌, న‌మీబియా ఉండ‌గా గ్రూప్‌-బిలో ఆస్ట్రేలియా, శ్రీలంక‌, ఐర్లాండ్‌, జింబాబ్వే, ఒమ‌న్‌లు ఉన్నాయి. ఇక గ్రూప్‌-సిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్‌, నేపాల్, ఇట‌లీ, స్కాట్లాండ్‌లు ఉండ‌గా గ్రూప్‌-డిలో న్యూజిలాండ్‌, ద‌క్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్‌, కెన‌డా, యూఏఈలు ఉన్నాయి.

Tilak Varma : రీఎంట్రీలో తిల‌క్ వ‌ర్మ సూప‌ర్ బ్యాటింగ్‌.. 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లతో

ఫార్మాట్ ఇలా..

గ్రూప్‌లోని ప్ర‌తి జ‌ట్టూ.. మిగిలిన నాలుగు జ‌ట్ల‌తో ఒక్కో మ్యాచ్ ఆడ‌నుంది. ఆ త‌రువాత ప్ర‌తి గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సూప‌ర్‌-8కు అర్హ‌త సాధిస్తాయి. ఇక్క‌డ ఐసీసీ సీడింగ్స్ ఆధారంగా అర్హ‌త సాధించిన ఎనిమిది జ‌ట్ల‌ను నాలుగేసి చొప్పున రెండు గ్రూపులుగా విభ‌జిస్తారు. ఇక్క‌డ కూడా గ్రూప్‌లోని ప్ర‌తి జ‌ట్టు మిగిలిన మూడు జ‌ట్ల‌తో ఒక్కొ మ్యాచ్ ఆడ‌నుంది. ఆ త‌రువాత గ్రూప్‌లో టాప్‌-2 లో నిలిచిన జ‌ట్టు సెమీస్‌కు చేరుకుంటాయి.

సెమీస్ చేరే జట్లు ఇవే..

టీ20 ప్ర‌పంచ‌కప్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌డంతో సెమీఫైన‌ల్ కు చేరుకునే జ‌ట్లు ఏవో దిగ్గ‌జ ఆట‌గాళ్లు ఓ అంచనా వేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇంగ్లాండ్ మాజీ ఆట‌గాడు మైఖేల్ వాన్ కూడా అంచ‌నా వేశాడు. ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్, భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్లు సెమీస్‌కు చేరుకుంటాయ‌ని జోస్యం చెప్పాడు. ముఖ్యంగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టును వాన్ ప‌క్క‌న పెట్టేశాడు.

Salman Ali Agha : భార‌త్‌తో ఆడొద్ద‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యం పై పాక్ టీ20 కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘా కామెంట్స్..