×
Ad

Nara Lokesh : చిరు వ్యాపారి వలీని త్వరలోనే కలుస్తా.. మంత్రి నారా లోకేశ్ ట్వీట్.. నాగబాబు మద్దతు

Nara Lokesh : తెలుగు రాష్ట్రాల్లో ‘కోవా బన్’ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై నారా లోకేశ్, ఎమ్మెల్సీ నాగబాబు స్పందించారు.

Minister Nara Lokesh, MLC Nagababu

Nara Lokesh : తెలుగు రాష్ట్రాల్లో ‘కోవా బన్’ చిరు వ్యాపారి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కర్నూలుకు చెందిన కోవా బన్ వ్యాపారి వలీతో మేడారం జాతరలో కొందరు వ్యవహరించిన తీరుపై పలువురు నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై తాజాగా.. ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ మేరకు వలీకి సంబంధించిన వీడియోను ట్యాగ్ చేస్తూ ట్విటర్ వేదికగా ఆయన మద్దతుగా నిలిచారు.

Also Read : AP Govt : ఏపీలోని పేదలకు ప్రభుత్వం మరో అద్భుతమైన అవకాశం.. పూర్తిగా ఉచితం, వెంటనే దరఖాస్తు చేసుకోండి

నారా లోకేశ్ ట్వీట్ ప్రకారం.. ‘ప్రియమైన సోదరుడు వలీ. మీరు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఎల్లప్పుడూ సామరస్యం, పరస్పర గౌరవం, సోదరభావం కోసం నిలబడే మన తెలుగు సమాజంలో ఇటువంటి విభజన, మతపరమైన ప్రవర్తనకు స్థానం లేదు. నేను త్వరలో మిమ్మల్ని కలుస్తాను. మీ ప్రసిద్ధ కోవా బన్‌ను రుచి చూడటానికి ఎదురు చూస్తున్నాను.. మేము కలిసి నిలబడతాము.’’ పేర్కొన్నారు.


అండగా ఎమ్మెల్సీ నాగబాబు..
కుటుంబాన్ని పోషించేందుకు కోవా బన్ అమ్ముకుంటున్న సాధారణ పౌరుడు వలీని కొందరు పనిగట్టుకొని భయబ్రాంతులకు గురిచేయడం సురికాదని ఎమ్మెల్సీ, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. కొందరి అత్యుత్సాహం వల్ల ఓ కుటుంబం ఇవాళ పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. చిరు వ్యాపారులకు చేతనైతే చేయూతనివ్వాలి తప్ప ఆరోపణలతో వారి కడుపు కొట్టడం సరికాదు. న్యాయబద్దంగా, నాణ్యమైన చిరుతిండి పదార్థాలు విక్రయించే చిరు వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.