Virat Kohli : పాక్‌తో మ్యాచ్‌.. కోహ్లికి కైఫ్ కీల‌క సూచ‌న‌.. దాన్ని త‌గ్గించుకో..

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లికి పాకిస్తాన్ పై మంచి రికార్డు ఉంది.

Virat Kohli - Mohammad Kaif

Virat Kohli – Mohammad Kaif : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో మ‌రో ఆసక్తిక‌ర పోరుకు రంగం సిద్ధ‌మైంది. న్యూయార్క్‌లోని నాసౌ కౌంటీ క్రికెట్ గ్రౌండ్‌లో భార‌త్, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం ఈ మ్యాచ్ ఆదివారం రాత్రి 8 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ చూసేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం ఇరు జ‌ట్ల‌కు కీల‌క‌మే కావ‌డంతో మ్యాచ్ హోరాహోరీగా జ‌ర‌గ‌నుంది.

కాగా.. ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లికి పాకిస్తాన్ పై మంచి రికార్డు ఉంది. అయితే.. ఐర్లాండ్‌తో జ‌రిగిన మొద‌టి మ్యాచులో కోహ్లి విఫ‌లం అయ్యాడు. ఈ క్ర‌మంలో కోహ్లికి టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు మ‌హ‌మ్మ‌ద్ కైఫ్ ఓ కీల‌క స‌ల‌హా ఇచ్చాడు. విరాట్ త‌న దూకుడును త‌గ్గించుకోవాల‌ని సూచించాడు. త‌న స్ట్రైక్‌రేటును ప‌ట్టించుకోవ‌ద్ద‌ని చెప్పాడు. త‌న స‌హ‌జ శైలిలోనే బ్యాటింగ్ చేయాల‌న్నాడు.

NED vs RSA : ఓడిపోయే మ్యాచ్‌లో గ‌ట్టెక్కిన సౌతాఫ్రికా.. కొద్దిలో పెను సంచ‌ల‌నం మిస్సైందిగా..!

కోహ్లి ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడ‌ని కైఫ్ చెప్పాడు. ఒక్క‌సారి అత‌డు క్రీజులో కుదురుకుంటే ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్లు అత‌డిని ఔట్ చేయ‌డం చాలా క‌ష్ట‌మ‌న్నాడు. ఐపీఎల్‌లో అత‌డు అద్భుతంగా ఆడాడ‌ని, ప‌వ‌ర్ ప్లేలో బౌండ‌రీలు వ‌ర్షం కురిపించాడ‌న్నారు. ఎలాంటి షాట్ల‌నైనా అల‌వోక‌గా ఆడ‌గ‌ల‌డ‌న్నాడు. స్ట్రైక్‌రేటును అత‌డు ప‌ట్టించుకోవ‌ద్ద‌న్నాడు. అత‌డు 130 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేస్తే భార‌త్‌కు మేలు జ‌రుగుతుంద‌న్నాడు.

ఆఖ‌రి ఓవ‌ర్ల‌లో అత‌డు కీల‌క‌మ‌ని చెప్పాడు. డెత్ ఓవ‌ర్ల‌లో కోహ్లి 60 నుంచి 70 ప‌రుగులు చేయ‌గ‌ల‌డ‌న్నాడు. అత‌డు ఓపెన‌ర్‌గా కాకుండా మూడో స్థానంలోనే ఆడిస్తేనే ఉప‌యోగం ఉంటుంద‌ని కైఫ్ అభిప్రాయప‌డ్డాడు.

IND vs PAK : భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌.. క‌ల‌వ‌ర‌పెడుతున్న పిచ్‌.. సై అంటున్న‌ వ‌రుణుడు.. విజ‌యం ఎవ‌రిదో ?

ట్రెండింగ్ వార్తలు