Mohammed Shami : టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మహమ్మద్ షమీ.. 13ఏళ్ల ప్రయాణానికి ముగింపు! భావోద్వేగ పోస్ట్
Mohammed Shami : టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
- Harish Thanniru
- Published on- November 7, 2026 / 07:34 AM IST
Mohammed Shami
Mohammed Shami Announces Retirement From Test Cricket : టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సుమారు 13 ఏళ్ల పాటు టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌లో భారత జట్టుకు సేవలందించిన షమీ.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ సందర్భంగా టెస్టు క్రికెట్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు.
Also Read : IND vs NZ : భారత్ vs న్యూజిలాండ్ రెండో వన్డే.. జియోలో రాదు.. మరీ ఎక్కడ చూడాలో తెలుసా?
‘‘భారత్ తరఫున తొలిసారి టెస్టు జెర్సీ ధరించినప్పుడు దేశం కోసం ఏదైనా సాధించాలనే కల మాత్రమే తనకు ఉండేదని షమీ పేర్కొన్నాడు. ఆ తర్వాత ప్రతి వికెట్, ప్రతి పోరాటం, ప్రతి గాయం, ప్రతి పునరాగమనం తనకు ఎన్నో పాఠాలు నేర్పాయని తెలిపాడు. టెస్టు క్రికెట్ తనకు కేవలం ఒక ఫార్మాట్ మాత్రమే కాదని, తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన భాగమని పేర్కొన్నాడు.
ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, కుటుంబ సభ్యులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే బీసీసీఐ, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) తన ప్రతిభను నమ్మి అవకాశాలు కల్పించినందుకు షమీ ధన్యవాదాలు చెప్పాడు.’’
2013 నవంబర్ 6న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మహమ్మద్ షమీ టెస్టు అరంగేట్రం చేశాడు. సరిగ్గా 13 ఏళ్ల తర్వాత అదే నవంబర్ 6న టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం.
మహ్మద్ షమీ టెస్టు కెరీర్‌లో మొత్తం 64 మ్యాచ్‌లు ఆడి.. 229 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆరు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఒక ఇన్నింగ్స్‌లో 6/56 అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. 2023 జూన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ అతడికి చివరి టెస్టు మ్యాచ్‌గా నిలిచింది.
టెస్టులకు మాత్రమే షమీ వీడ్కోలు పలికాడు. క్రికెట్‌కు పూర్తిగా దూరం కావడం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగాలని భావిస్తున్నాడు. వన్డేలు, టీ20లతో పాటు ఐపీఎల్‌లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. అవసరమైతే ఫిట్‌నెస్ కోసం దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోనూ ఆడేందుకు సిద్ధమని వెల్లడించాడు.
