Bhuvneshwar Kumar : నాలుగేళ్ల త‌రువాత రీ ఎంట్రీ.. రెండు మ్యాచ్‌ల‌కే ప‌రిమితం కానున్న భువీ.. బౌలింగ్ కోచ్ మోర్కెల్ కీల‌క వ్యాఖ్య‌లు..

Bhuvneshwar Kumar : టీమ్ఇండియా వెట‌ర‌న్ ఆట‌గాడు భువ‌నేశ్వ‌ర్ కుమార్ పైనే ప్ర‌స్తుతం అంద‌రి దృష్టి ఉంది.

Morne Morkel spoke on veteran pacer Bhuvneshwar Kumar ahead of IND vs NZ 3rd T20

Bhuvneshwar Kumar : టీమ్ఇండియా వెట‌ర‌న్ ఆట‌గాడు భువ‌నేశ్వ‌ర్ కుమార్ పైనే ప్ర‌స్తుతం అంద‌రి దృష్టి ఉంది. నాలుగేళ్ల త‌రువాత రీ ఎంట్రీ ఇచ్చిన ఈ స్వింగ్ కింగ్ అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌లం అయ్యాడు. కివీస్‌తో జ‌రిగిన తొలి రెండు టీ20 మ్యాచ్‌ల్లో ధారాళంగా ప‌రుగులు ఇచ్చాడు. ఈ క్ర‌మంలో మూడో టీ20 మ్యాచ్‌లో అత‌డిపై వేటు ప‌డ‌నుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మూడో టీ20 మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్యాన్ని సంత‌రించుకున్నాయి.

2025, 2026 ఐపీఎల్ సీజ‌న్ల‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు ట్రోఫీల‌ను కైవ‌సం చేసుకోవ‌డంలో 36 ఏళ్ల భువీ కీల‌క పాత్ర పోషించాడు. ఐపీఎల్‌తో పాటు దేశ‌వాళీలోనూ మంచి ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంలో టీమ్ఇండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. బుమ్రా లేని లోటును తీరుస్తాడ‌ని అంతా భావించారు. అయితే.. కివీస్‌తో తొలి రెండు మ్యాచ్‌ల్లో అత‌డు 0/49, 1/50 గ‌ణాంకాల‌ను న‌మోదు చేశాడు. ఈ క్ర‌మంలో అత‌డి పున‌రాగ‌మ‌నం, ప్ర‌ద‌ర్శ‌న‌పై మోర్నీ మోర్కెల్ మాట్లాడాడు.

IND vs NZ : న్యూజిలాండ్‌తో మూడో టీ20 మ్యాచ్‌.. టీమ్ఇండియాకు భారీ షాక్..

‘అతని పునరాగమనం పట్ల నాకు చాలా సానుభూతి ఉంది. నాలుగేళ్ల తర్వాత తిరిగి రావ‌డంతో స‌హ‌జంగానే అత‌డిపై భారీ అంచనాలు ఉంటాయి. అతను ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. చాలా బాగా బౌలింగ్ చేశాడు. అయితే.. అంతర్జాతీయ క్రికెట్ ఆడటం అనేది పూర్తిగా భిన్నం. ఇక్కడ అవకాశాలు చాలా స్వల్పంగా ఉంటాయి. షెడ్యూల్ కారణంగా అతను పరిమిత శిక్షణతోనే వచ్చి.. తనను తాను సిద్ధం చేసుకోవాల్సి వచ్చింది.

అత‌డికి నైపుణ్యం, అనుభవం, అన్నీ ఉన్నాయి, అయితే.. మనం క్రికెట్ ఆటను గౌరవించాలి. అత‌డు కుదురుకోవ‌డానికి కొన్ని మ్యాచ్‌ల్లో వ‌రుస‌గా అవ‌కాశాలు ఇవ్వాలి. త్వ‌ర‌లోనే అత‌డు త‌న ల‌య‌ను క‌నుగొంటాడు. అత‌డికి నేను ఇచ్చే స‌ల‌హా.. బ‌య‌ట విష‌యాల గురించి అతిగా ఆలోచించ‌కు.. నువ్వు నువ్వుగా ఉండు.. అని జ‌ట్టులో చేరిన‌ప్ప‌టి నుంచి చెబుతున్నా.’ అని మోర్కెల్ తెలిపాడు.