MS Dhoni : ధోనీ భయ్యా ఇలా అన్నావేంటి..! కొత్తగా పెళ్లైన జంటకు భలే సలహా.. పాపం భర్తల పరిస్థితి అంతేనా!
MS Dhoni సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్నాడు.
- Harishth Thanniru
- Published On : November 29, 2025 / 10:59 AM IST
MS Dhoni
MS Dhoni : ఎంఎస్ ధోని.. ఈ పేరు వింటే క్రికెట్ అభిమానుల్లో ఓ రకమైన ఉత్సాహం కనిపిస్తుంది. పిచ్చ టెన్షన్ సమయంలోనూ కూల్‌గా ఎలా ఉండాలో ధోనీని చూసి నేర్చుకోవచ్చు. మ్యాచ్‌లు ఆడే సమయంలో ధోనీ గంభీరంగా, కూల్‌గా కనిపించినా.. మైదానం బయట తన హాస్య చతురతతో అందరినీ ఆకట్టుకుంటాడు. తోటి క్రికెటర్లను ఆటపట్టిస్తూ సరదాగా కనిపించే ధోనీ.. ఫ్యామిలీకీ తగిన సమయం ఇస్తూ వారితోనూ అంతే సరదాగా ఉంటాడు. అయితే, తాజాగా.. మహేంద్ర సింగ్ ధోనీ ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న వీడియో వైరల్ అవుతుంది. ఆ సమయంలో వధువు, వరుడిని ఉద్దేశించి ధోనీ చేసిన వ్యాఖ్యలు అందరికీ నవ్వులు తెప్పించాయి. అదే సమయంలో భర్తలందరి పరిస్థితి ఇంతేనని ధోనీ తేల్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ధోనీ భయ్యా ఇలా అన్నావేంటి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్నాడు. ఈ వేడుకలో నూతన జంటను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి పలు సలహాలు, సూచనలు చేశాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వుల జల్లులు కురిపించారు.
ధోనీ నూతన జంటను ఉద్దేశించి మాట్లాడుతూ.. కొంత మంది నిప్పుతో చెలగాటమాడాలని అనుకుంటారు. వారిలో ఉత్కర్ష్ (పెళ్లి కొడుకు) ఒకరు. అయితే, నాకు కూడా ఈ విషయంలో మినహాయింపు ఉందని అనుకోకండి. నా భార్య కూడా అంతే. ఇక్కడ ఉన్న భర్తల అందరి పరిస్థితి కూడా ఇంతే. నువ్వు వరల్డ్ కప్ గెలిచావా..?లేదా..? అనేది ఇక్కడ అసలు విషయం కాదు’ అంటూ ధోని అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుల జల్లులు కురిపించారు. ఆ తరువాత ధోనీ పెండ్లి కుమార్తెకు ఓ సూచన చేశాడు. భర్త కోపంగా ఉన్నప్పుడు మీరు ఏమీ అనకండి. ఎందుకంటే భర్తల కోపం ఐదు నిమిషాల్లో చల్లారిపోతుంది అంటూ సూచన చేశాడు.
Captain cool turning into Husband School 😭❤️ pic.twitter.com/tt7nD0I9Uf
— Professor Sahab (@ProfesorSahab) November 27, 2025
పెళ్లిపై ధోనీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ధోనీ భయ్యా నువ్వు కూడా మాలో ఒకడివా.. అంటూ చమత్కరిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
