MS Dhoni : రిషబ్‌పంత్, జహీర్‌ఖాన్‌లతో ధోనీ పార్టీలు..! ఫోటో వైరల్
MS Dhoni-Rishabh Pant : అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ అయిన తరువాత భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతున్నారు.
- Thota Vamshi Kumar
- Published On : December 11, 2023 / 07:08 PM IST
MS Dhoni poses with Zaheer Khan and Rishabh Pant at a birthday party
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ అయిన తరువాత భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతున్నారు. తాజాగా ఓ స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు హాజరయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తో పాటు టీమ్ఇండియా మాజీ ఆటగాళ్లు జహీర్ ఖాన్, పార్థివ్ పటేల్ లు ఉన్నారు.
2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన ధోని కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ విజేతగా ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ధోని కెప్టెన్సీలో చెన్నై జట్టు 5 సార్లు ఐపీఎల్ కప్పును ముద్దాడింది. ఐపీఎల్ 2023 సీజన్ తరువాత ధోని తన మోకాలి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇదే అతడికి చివరి సీజన్ అని ప్రచారం జరిగినప్పటికీ మరో సీజన్ ఆడతానని ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అనంతరం ధోని చెప్పిన సంగతి తెలిసిందే.
అయినప్పటీకి అంత త్వరగా అతడు కోలుకుంటాడా..? అన్న సందేహాలు అభిమానుల మదిలో ఉన్నాయి. వీటిని పటాపంచలు చేస్తూ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2024 మినీ వేలానికి ముందు ధోనిని రిటైన్ చేసుకుంది. దీంతో ఐపీఎల్ 2024 సీజన్ ధోని ఆడడం ఖాయంగా కనిపిస్తోంది.
ఐపీఎల్‌తోనే రీ ఎంట్రీ..!
New Rule in Cricket : అలర్ట్.. రేపటి నుంచే క్రికెట్‌లో కొత్త రూల్.. బౌలర్లకు కష్టకాలమే..!
గతేడాది డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ గాయపడ్డాడు. గాయాల నుంచి కోలుకున్న పంత్ ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ నుంచి పంత్ మళ్లీ క్రికెట్ ఆడతాడనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అతడు సారథ్యం వహిస్తాడని ఇప్పటికే ఢిల్లీ జట్టు తెలిపింది. అయితే.. అందుతున్న నివేదిక ప్రకారం పంత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక టీమ్ఇండియా తరుపున పంత్ ఎప్పుడు బరిలోకి దిగుతాడు అనే విషయంలో అయితే ప్రస్తుతానికి స్పష్టత లేదు.
