MS Dhoni : తొలి వన్డేలో ధోని సందడి.. మిస్టర్ కూల్ చెవిలో ఉన్న ఆ వింత పరికరం ఏంటో తెలుసా?
భారత్ వర్సె స్ ఇంగ్లాండ్ తొలి వన్డే మ్యాచ్‌ను ఎంఎస్ ధోని (MS Dhoni) మైదానంలో ప్రత్యక్షంగా వీక్షించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- July 15, 2026 / 02:14 PM IST
MS Dhoni spotted wearing unique earpiece during IND vs ENG 1st ODI
MS Dhoni : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్‌ను టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని మైదానంలోని వీఐపీస్టాండ్స్‌లో కూర్చుని వీక్షించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే.. ధోని చెవిలో ఓ చిన్న పరికరాన్ని పెట్టుకుని కనిపించాడు. దీంతో అతడు పెట్టుకున్న పరికరం ఏంటి అనే దానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.
చాలా మంది దానిని బ్లూటూత్ లేదా ఇయర్ బర్స్ అని అనుకున్నారు. కానీ.. అది స్టేడియం రేడియో రిసీవర్ అనే ప్రత్యేక పరికరం. దీని ద్వారా స్టేడియంలోనే కూర్చొని బంతి బంతికి లైవ్ కామెంటరీ (Live Commentary) వినవచ్చు. దీంతో ప్రత్యక్షంగా మ్యాచ్‌ను చూస్తూనే.. కామెంట్రీ కూడా వినవచ్చు. ఇలాంటి రేడియో రిసీవర్లు ఇంగ్లాండ్ క్రికెట్ మైదానాల్లో చాలా సాధారణం.
Virat Kohli : విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. వన్డే దిగ్గజాలు సచిన్, ద్రావిడ్ సరసన చోటు..
ఇది ఎలా పనిచేస్తుంది?
* ఇది స్టేడియం పరిధిలో మాత్రమే పనిచేసే లోకల్ రేడియో సిగ్నల్‌ను అందుకుంటుంది.
* మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలోనే ఈ పరికరాలను అద్దెకు తీసుకోవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు.
* సరైన ఛానెల్‌కు ట్యూన్ చేస్తే ప్రత్యక్ష వ్యాఖ్యానం నిరంతరంగా వినిపిస్తుంది.
* స్టేడియం వెలుపలికి వెళ్లగానే సిగ్నల్ నిలిచిపోతుంది.
ఈ పరికరాలను సాధారణ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా దూరంగా కూర్చున్నప్పుడు ఫీల్డింగ్ మార్పులు, బౌలర్ల వ్యూహాలు, గణాంకాలు వంటి విషయాలను వెంటనే అర్థం చేసుకోవడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
