ఏడు మ్యాచుల్లో 5 ఫసక్.. ముంబై ఇక అస్సామేనా? ప్లే ఆఫ్స్ కి వెళ్తుందా?.. గతంలో జరిగిన ఈ అద్భుతం జరగాలి..
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) పేలవ ప్రదర్శన చేస్తోంది.
- Thota Vamshi Kumar
- Updated on- April 24, 2026 / 09:58 AM IST
Mumbai Indians Play offs chances after 7 matchs complet in IPL 2026 (pic credit@ipl)
- ఐపీఎల్ 2026 సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబై
- 7 మ్యాచ్‌లు ఆడగా రెండు మ్యాచ్‌ల్లోనే విజయం
- మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి
- ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే?
Mumbai Indians : ఐపీఎల్ 2026 సీజన్‌లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన జట్లే పేలవ ప్రదర్శన చేస్తుండగా అసలు ఏమాత్రం అంచనాలు లేని జట్లు అదరగొడుతున్నాయి. ఐదు సార్లు ఛాంపియన్లుగా నిలిచిన ముంబై జట్టు ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తోంది. ఇప్పటి వరకు ఈ జట్టు లీగ్ దశలో సగం మ్యాచ్‌లు (7) ఆడేసింది. రెండు అంటే రెండు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించగా మరో ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
ఆ జట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉండగా.. నెట్ రన్‌రేటు -0.736గా ఉంది. పాయింట్ల పట్టికలో 8వ స్ధానంలో నిలిచింది. ఈ సీజన్‌లో ముంబై లీగ్ దశలో మరో 7 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ ఏడు మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ ఎన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు ఉన్నాయో ఓ సారి చూద్దాం.
Hardik Pandya : హార్దిక్ పాండ్యా ఫామ్ పై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ జయవర్ధనే కీలక వ్యాఖ్యలు..
ఇప్పటికే పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ వరుసగా 11, 10 పాయింట్లతో టాప్-2 స్థానాల్లో ఉన్నాయి. ప్లే ఆఫ్స్ కు చాలా దగ్గరగా ఉన్నాయి. ఇక ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ లు కూడా చెరో 8 పాయింట్లు సాధించాయి. ఇక ముంబై పై విజయం సాధించి సీఎస్‌కే 6 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో తాము ఉన్నట్లు చెప్పకనే చెప్పింది.
ఇప్పటి వరకు సగం సీజన్ మాత్రమే కంప్లీట్ అయింది. ఇంకా సగం సీజన్ మిగిలి ఉంది. ఇక పై ప్రతి జట్టు ఆడే మ్యాచ్ చాలా కీలకం కానుంది. గెలిచిన జట్టు ప్లేఆఫ్స్‌కు దగ్గర అవుతాది.. అదే సమయంలో ఓడిపోయిన జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి.
ఇక గత సీజన్లను పరిగణలోకి తీసుకుంటే 16 పాయింట్లు సాధించిన జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. ముంబై ఖాతాలో ప్రస్తుతం నాలుగు పాయింట్లు ఉన్నాయి. అంటే ఈ లెక్కన మరో 12 పాయింట్లు కావాల్సి ఉంది. అంటే మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో 6 గెలవాల్సి ఉంది. గతంలో పలు సీజన్లలో ముంబై ఇలాంటి స్థితిలో నిలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంతో పాటు కప్పును సొంతం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ముంబై పుంజుకుని ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
