×
Ad

T20 World Cup 2026: ఇండియా Vs నమీబియా.. మ్యాచ్‌కు దూరమైన అభిషేక్‌ శర్మ

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇవాళ భారత్‌, నమీబియా మధ్య మ్యాచ్ జరుగుతోంది.

Pic: @BCCI (X)

  • ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్‌
  • టాస్‌ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న నమీబియా  
  • జట్టులో  సంజూ శాంసన్‌, బుమ్రాకు చోటు 

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇవాళ భారత్‌, నమీబియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన నమీబియా ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఆరోగ్య సమస్యతో అభిషేక్‌ శర్మ మ్యాచ్‌కు దూరమయ్యాడు. సిరాజ్‌ కూడా ఆడడం లేదు. అభిషేక్ శర్మ, సిరాజ్‌ స్థానంలో సంజూ శాంసన్‌, బుమ్రాకు చోటు దక్కింది.

భారత జట్టు
భారత జట్టు: సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

నమీబియా జట్టు
లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లోఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేజే స్మిట్, జేన్ గ్రీన్ (వికెట్ కీపర్), రూబెన్ ట్రంపెల్మాన్, మాలన్ క్రూగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మ్యాక్స్ హైన్గో.