Dwayne Bravo : చూసుకో.. మైక్ ఆన్‌లోనే ఉంది.. ర‌హానే హెచ్చరించినా.. జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.. మ‌హిళ‌ల‌పై బ్రావో అనుచిత వ్యాఖ్య‌లు..

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మెంటార్‌, బౌలింగ్ కోచ్‌ డ్వేన్ బ్రావోపై (Dwayne Bravo) విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది.

Netizens fires on KKR Bowling Coach Dwayne Bravo I Have 2 Chicks In My House Comment

  • మ‌హిళ‌ల ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు
  • బ్రావో పై విమ‌ర్శ‌లు
  • ర‌హానే హెచ్చరించినా

Dwayne Bravo : వెస్టిండీస్ దిగ్గ‌జ ఆట‌గాడు, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మెంటార్‌, బౌలింగ్ కోచ్‌ డ్వేన్ బ్రావోపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది. మ‌హిళ‌ల ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డ‌మే అందుకు కార‌ణం. అమ్మాయిల‌ను కోడిపిల్ల‌లు అని అర్థం వ‌చ్చేలా అత‌డు మాట్లాడిన మాట‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. నెటిజ‌న్లు బ్రావో పై మండిప‌డుతున్నారు.

అస‌లేం జ‌రిగింది?

ఐపీఎల్ 2026 సీజ‌న్ ప్రారంభం నేప‌థ్యంలో శుక్ర‌వారం కోల్‌క‌తా నైట‌రైడ‌ర్స్ జ‌ట్టు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించింది. ఈ స‌మావేశంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్యా ర‌హానే, అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్స‌న్‌, హెడ్ కోచ్ అభిషేక్ నాయ‌ర్‌ల‌తో పాటు మెంటార్ బ్రావో పాల్గొన్నాడు.

IRE vs IND : ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. షెడ్యూల్ విడుద‌ల చేసిన బీసీసీఐ.. 19 ఏళ్ల త‌రువాత బెల్‌ఫాస్ట్‌కు టీమ్ఇండియా

అయితే.. విలేక‌రుల స‌మావేశం అధికారికంగా ప్రారంభం కావ‌డాని క‌న్నా ముందు మైకులు ఆన్ చేసి ఉన్నాయని తెలియని బ్రావో.. తన తోటి కోచ్‌లతో సరదా సంభాషణలో నిమగ్నమయ్యాడు. వాట్స‌న్‌తో మాట్లాడుతూ.. నేను ఇంటి ద‌గ్గ‌ర రెండు చిక్స్‌తో (ఇద్ద‌రు అమ్మాయిల‌తో) ఉన్న‌ప్పుడు వీళ్లు స‌మావేశానికి రావాల‌ని ఫోన్ చేశార‌ని అన్నాడు. వెంట‌నే కెప్టెన్ ర‌హానే మైకులు ఆన్‌లో ఉన్నాయ‌నే విష‌యాన్ని గుర్తు చేస్తూ జాగ్ర‌త్త‌గా మాట్లాడు అంటూ సున్నితంగా హెచ్చ‌రించాడు. ఈ ఘ‌ట‌న మొత్తం కెమెరాల్లో రికార్డు అయింది.

Virat Kohli : ఐపీఎల్ 2026కి ముందు ఆర్‌సీబీ ఆట‌గాళ్ల‌కు కోహ్లీ వార్నింగ్‌ .. ఈ సారి చాలా క‌ష్టం.. 120 శాతం..

బ్రావో ఉప‌యోగించిన పదాల పట్ల నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.