IND vs NZ : భారత్‌తో తొలి వన్డేకు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్..
భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు (IND vs NZ) భారీ షాక్ తగిలింది.
New Zealand Batter Devon Conway to miss opening ODI against India
IND vs NZ : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం నుంచి ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే మ్యాచ్‌కు ఆక్లాండ్ ఆతిథ్యం ఇస్తోంది. కాగా.. తొలి వన్డేకు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు డెవాన్ కాన్వె ప్రాక్టీస్ సెషన్లో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడు తొలి వన్డే మ్యాచ్‌కు ముందు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
‘ప్రాక్టీస్ సెషన్లో ఓ క్యాచ్‌ను అందుకునే క్రమంలో డెవాన్ కాన్వే, మాట్ హెన్రీలు ఒకరినొకరు డీ కొన్నారు. ఈ క్రమంలో డెవాన్ కాన్వే తలకు తీవ్రమైన గాయమైంది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో అతడు కంకషన్ (తలకి బలమైన దెబ్బ తగలడం)కు గురి అయినట్లు నిర్థారణ అయింది. దీంతో అతడు మ్యాచ్‌కు దూరం అయ్యాడు.’ అని ఓ ప్రకటనలో కివీస్ బోర్డు తెలిపింది. అయితే.. మరో ఆటగాడు హెన్రీ బాగానే ఉన్నాడని, అతడు తొలి వన్డే కోసం సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నాడని పేర్కొంది.
New Zealand batter out of India ODI series opener after training incident.
More 👇
https://t.co/or4Ly8ZYzM
— ICC (@ICC) November 3, 2026
డెవాన్ కాన్వే స్థానంలో టిమ్ సీఫెర్ట్ బరిలోకి దిగనున్నాడని మంగళవారం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తెలిపాడు. కాగా.. గాయాల కారణంగా ఇప్పటికే మార్క్‌చాప్‌మన్, రచిన్ రవీంద్రలు భారత్‌తో వన్డే సిరీస్ ఆడడం లేదు. ఇక ఇప్పుడు కాన్వే కూడా దూరం కావడం న్యూజిలాండ్ కు విజయావకాశాలను ఖచ్చితంగా దెబ్బతీస్తుందని చెప్పవచ్చు.
