India vs New Zealand : భారత్‌కు బిగ్ షాకిచ్చేందుకు సిద్ధమైన కివీస్.. జట్టులో కీలక మార్పులు.. కొత్త బౌలర్ ఎంట్రీ..
India vs New Zealand : నాల్గో వన్డేలో విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని కివీస్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా చివరి రెండు వన్డేల కోసం జట్టులో మార్పులు చేసింది. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న 31 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ బ్రెట్ రాండెల్‌కు తొలిసారి జాతీయ జట్టులో చోటు కల్పించింది.
- Harish Thanniru
- Updated on- November 12, 2026 / 12:45 PM IST
India vs New Zealand
India vs New Zealand : భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ జట్టు కీలక మార్పులు చేసింది. చివరి రెండు వన్డేల కోసం 31 ఏళ్ల పేసర్ బ్రెట్ రాండెల్‌కు తొలిసారి జాతీయ జట్టులో చోటు కల్పించింది. మరోవైపు ఆల్‌రౌండర్ జోష్ క్లార్క్‌సన్‌ను కూడా జట్టులోకి తీసుకుంది.
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మూడు మ్యాచ్ లలో మొదటి రెండు మ్యాచ్ లలో న్యూజిలాండ్ జట్టు ఓడిపోయింది. మూడో వన్డే వర్షం కారణంగా రద్దయింది. అయితే, నాల్గో వన్డేలో విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని కివీస్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా చివరి రెండు వన్డేల కోసం జట్టులో మార్పులు చేసింది. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న 31 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ బ్రెట్ రాండెల్‌కు తొలిసారి జాతీయ జట్టులో చోటు కల్పించింది. నాలుగో, ఐదో వన్డేల కోసం అతడిని ఎంపిక చేసింది. దేశవాళీ క్రికెట్‌లో అతడి ప్రదర్శనను గుర్తించిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జాతీయ జట్టులో అవకాశం కల్పించింది. దీంతో ఈ సిరీస్‌లోనే రాండెల్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
మరోవైపు ఆల్‌రౌండర్ జోష్ క్లార్క్‌సన్‌ను ఐదో వన్డే కోసం న్యూజిలాండ్ జట్టులోకి తీసుకున్నారు. బౌలింగ్ విభాగంలో గాయాల సమస్యలు, టెస్టు సిరీస్ సన్నాహాల నేపథ్యంలో జట్టు కూర్పులో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదిలాఉంటే.. భారత్‌తో నాలుగో వన్డే నవంబర్ 13న, ఐదో వన్డే నవంబర్ 15న మౌంట్ మాంగనూయ్‌లో జరగనున్నాయి.
నాలుగో వన్డేకు న్యూజిలాండ్ జట్టు..
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, క్రిస్టియన్ క్లార్క్, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, మిచ్ హే, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, నిక్ కెల్లీ, బ్రెట్ రాండెల్, టిమ్ సీఫర్ట్, విల్ యంగ్.
ఐదో వన్డేకు న్యూజిలాండ్ జట్టు..
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్‌సన్, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, మిచ్ హే, నిక్ కెల్లీ, బ్రెట్ రాండెల్, టిమ్ సీఫర్ట్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.
