Nitish Kumar Reddy : ప్రెస్ కాన్ఫరెన్స్‌ మధ్యలో నితీశ్‌ రెడ్డికి వాళ్ల అమ్మ నుంచి ఫోన్.. అతను చేసిన పనికి అంతా షాక్.. వీడియో వైరల్.. నెటిజన్ల ప్రశంసల జల్లు

Nitish Kumar Reddy : మీడియా సమావేశంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు నితీశ్ రెడ్డి సమాధానం ఇస్తున్న క్రమంలో.. అతనికి ఫోన్ వచ్చింది. ఫోన్ రింగ్ అవుతుండటంతో ఒక్క నిమిషం మాట్లాడటం ఆపేసిన నితీశ్ సారీ చెప్పి.. తన తల్లి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌ను లిఫ్ట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Nitish Kumar Reddy

  • ప్రెస్‌కాన్ఫరెన్స్‌ సమయంలో నితీశ్ రెడ్డికి అమ్మ ఫోన్
  • అమ్మా.. ఐదు నిమిషాలు ఆగి చేస్తా అంటూ సమాధానం
  • వీడియో వైరల్.. నెటిజన్ల ప్రశంసల జల్లు

Nitish Kumar Reddy : ఇండియా వర్సెస్ అఫ్గానిస్థాన్ జట్ల మధ్య తొలి వన్డే శనివారం జరిగింది. వర్షం కారణంగా మ్యాచ్ ను అపైంర్లు 25ఓవర్లకు కుదిరించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ జట్టు 194 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు కేవలం 22.5 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, మ్యాచ్ లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కీలకమైన రెండు వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ అనంతరం నితీశ్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అతను విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న సమయంలో వాళ్ల అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు నితీశ్ రెడ్డి చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు.

Also Read : Shubman Gill : వావ్.. ఒంటిచేత్తో కళ్లుచెదిరే క్యాచ్ అందుకున్న శుభ్‌మన్ గిల్.. వీడియో వైరల్.. నెటిజన్ల ప్రశంసలు

మీడియా సమావేశంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు నితీశ్ రెడ్డి సమాధానం ఇస్తున్న క్రమంలో.. అతనికి ఫోన్ వచ్చింది. ఫోన్ రింగ్ అవుతుండటంతో ఒక్క నిమిషం మాట్లాడటం ఆపేసిన నితీశ్ సారీ చెప్పి.. తన తల్లి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌ను లిఫ్ట్ చేశాడు. అమ్మా.. నేను మళ్లీ చేస్తా అంటూ చెప్పాడు.. కానీ సరిగా వినిపించక పోవటంతో.. మళ్లీ.. అమ్మా నేను ఐదు నిమిషాలు ఆగిచేస్తా.. అని సమాధానం ఇచ్చాడు. ఆ వెంటనే ఫోన్ పక్కన పెట్టి నవ్వుతూ మీడియాకు మళ్లీ సారీ చెబుతూ.. ప్రెస్‌మీట్‌లో కంటిన్యూ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. వయస్సు లేదా వృత్తితో సంబంధం లేకుండా ప్రాధాన్యతలు అంటూ పేర్కొంది.


నితీశ్ రెడ్డి వాళ్ల అమ్మకు ఇచ్చిన ప్రాధాన్యతకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మన తెలుగును ప్రపంచ వేదికపై హైలైట్ చేస్తున్నాడు అంటూ కొందరు పేర్కొనగా.. నితీశ్‌ రెడ్డికి అమ్మ అంటే ఎంత ప్రేమో.. అమ్మ నుంచి కాల్ వస్తే ఎత్తక తప్పదు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతూ నితీశ్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.